Ram Pothineni: తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రామ్ పోతినేని. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే ‘రెడ్’ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా, ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామితో ‘వారియర్’ సినిమా చేశారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఆదివారం ‘వారియర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. సినిమా షూటింగ్‌లో మెడకు గాయమైనా.. అభిమానుల కోసం ప్రాణాలకు తెగించి ఫైట్లు, డ్యాన్సులు చేశానన్నారు. రామ్ మాట్లాడుతూ.. ‘‘వారియర్ నాకు ఎంతో ఎమోషనల్ సినిమా. ఈ సినిమా కోసం మొదటిసారి హెల్ప్ లెస్ ప్రాంతానికి వెళ్లా.
అక్కడ జిమ్‌కు వెళ్దామనుకున్నా. కానీ, అప్పుడే నా మెడకు గాయం అయింది. రోజులు గడుస్తున్నా నొప్పి తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లా. వర్కవట్లు చేస్తే ఒక కేజీ బరువుతో చెయ్యమని చెప్పారు. అలా కుదరదు అన్నాను. అప్పుడు డాక్టర్ నన్నో ప్రశ్న వేశాడు. మీకు లైఫ్ కావాలా? సినిమా కావాలా? అని అడిగాడు. ఆ ప్రశ్న నాకు అవుట్ సిలబస్ ప్రశ్నలా అనిపించింది. అక్కడినుంచి వచ్చాక ట్విటర్ మెసేజ్‌లు చూశా. సినిమాలో డ్యాన్సులు, ఫైట్లు చేయకపోయినా పర్లేదని అభిమానులు మెసేజ్‌లు పెట్టారు.
అప్పుడు అనిపించింది. వైజాగ్‌లో నేను అన్నట్లుగా మీరా?నేనా? అనేది వస్తే.. మీరు లేకపోతే నేను లేను అని నాకు అర్థమైంది. అందుకే నాకు ఎంత నొప్పి ఉన్నా డ్యాన్సులు, ఫైట్లు చేశాను. నాకు అంత ఎనర్జీ వచ్చిందంటే అందంతా మీ వల్లే’’ అని అన్నారు. కాగా, ‘వారియర్’ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా జులై 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మరి, రామ్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : R Madhavan: క్లైమాక్స్ మళ్లీ మళ్లీ చూశానని చెప్పి.. హీరోకి దొరికిపోయిన నెటిజెన్!