ఆయన పేరు ఓ సంచలనం. ఆయన మాట ఓ వివాదం. ముక్కుసూటి తనం ఆయన నైజం. ఆయనే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్ ను ఆడియన్స్ కు రుచిచూపించాడు వర్మ. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. ఇప్పుడూ మరో ఆసక్తికరమైన వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించబోతున్నాడు ఆర్జీవీ. ‘రకరకాల భార్యలు’ ఇందుకు సంబంధించి ఓ ప్రమోషనల్ వీడియోను వర్మ విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆర్జీవీ తెరకెక్కించిన సినిమాలు విజయం సాధించినా ఫెయిల్ అయినా రిలీజ్‌కు ముందు కచ్చితంగా వివాదాస్పదం అవుతాయి. దాంతో ఆ సినిమాలకు కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతూ ఉంటుంది. భార్యల మనస్తత్వాలు, వారి భిన్న స్వభావాల ఆధారంగా ‘రకరకాల భార్యలు’ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను రామ్‌గోపాల్‌వర్మ – తెరకెక్కించబోతున్నారు. ఇందులో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రామ్‌గోపాల్‌వర్మ సిరీస్ కాన్సెప్ట్‌ను తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
‘ఎంతోమంది కవులు, మహానుభావులు స్త్రీని అనేక రకాలుగా వర్ణించారు. అయితే కాలప్రవాహంలో రకరకాల మనస్తత్వం కలిగిన భార్యలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు. ఈ సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోరకం మనస్తత్వం కలిగిన భార్య గురించి వివరిస్తానని., ఒక మగవాడికి ఎలాంటి భార్య దొరికితే వాడి బ్రతుకు ఎలా తయారవుతుందనే అంశాన్ని తెరకెక్కిస్తానని వివరించారు.
స్త్రీల అసలు స్వరూపం వాళ్లు పెళ్లి చేసుకున్నాక బయటకొస్తుంది. ప్రపంచంలో మొత్తం ఎనిమిది రకాల భార్యలు ఉంటారు. ఏడుపుగొట్టు భార్య, దెబ్బలాడే భార్య, స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానపు పిశాచి, ముక్కుమీద కోపం, భర్తను తొక్కిఉండే భార్య, పిసినిగొట్టు, గొప్పలకు పోయే భార్యా ఇటువంటి భార్యలను ఈ వెబ్‌సీరిస్‌లో చూపించబోతున్నామంటూ చెప్పుకొచ్చారు.
ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో తరహా భార్యను చూపిస్తామంటూ ఇది సీజన్ 1. ఇక సీజన్ 2లో భర్తలను చూపించబోతున్నామంటూ ఆర్జీవీ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Producing a series “BHAARYALU” or HOW a MAN’s LIFE gets DUCKED by what kind of WIFE he gets.This MUST WATCH before MARRIAGE series is for https://t.co/V10cP5Aeb7 , Directed by RAJ stars 30 weds 21 fame @IamChaitanyarao .. LISTEN to MY voice explaining CONCEPT pic.twitter.com/GkvOU4XgBS
— Ram Gopal Varma (@RGVzoomin) July 24, 2021