కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమాధిని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సందర్శించుకున్నారు. హీరోయిన్స్ అప్సరా రాణి, నైనా గంగూలీ, డేంజరస్ సినిమా బృందంతో కలిసి బెంగళూరులోని కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, పునీత్ తల్లి పార్వతమ్మ, పునీత్ రాజ్ కుమార్ సమాధులను సందర్శించారు. కన్నడ ప్రజల హృదయాల్లో పునీత్ రాజ్ కుమార్ ఎప్పటికీ నిలిచిపోతారని రామ్ గోపాల్ వర్మ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: అల్లు అరవింద్ కుమారుడికే ఏపీ ఆన్ లైన్ టికెట్ కాంట్రాక్ట్!
‘నేను గతంలో రెండు మూడుసార్లు పునీత్ ను కలిశాను. అప్పు హఠాన్మరణం ఎవరూ జీర్ణించుకోలేనిది. నటుడిగా పునీత్ ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఇటీవల జేమ్స్ చిత్రం విజయమే అందుకు ఉదాహరణ. నటుడిగానే కాకుండా ఒక మంచి వ్యక్తిగా పునీత్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కన్నడ ప్రజల హృదయాల్లో పునీత్ ఎప్పటికీ నిలిచిపోతారు’ అంటూ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.