పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుని ఫ్యాన్స్ పండగలా జరుపుకున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ ఫ్యాన్స్ కి దీపావళి ఒకరోజు ముందే వచ్చిందని చెప్పాలి. పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్‌కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, సెలబ్రిటీలు అంతా ప్రభాస్ కు బర్త్‌డే విషెస్ చెప్పారు. అలాగే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిల్లా 4కే సినిమా ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే బిల్లా రిలీజ్ చేసిన కొన్ని థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్ యజమానులకు నష్టం తప్పలేదు. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో అయితే థియేటర్‌లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వాటి దెబ్బకు థియేటర్లో అగ్నిప్రమాదం సంభవించింది.
అలా కొన్నిచోట్ల ఫ్యాన్స్ చేసిన అల్లరి, మితిమీరిన సంబరాలు కొందరిని నష్టాలను మిగిల్చాయి. అలాగే అటు ప్రభాస్‌కు కుడా చెడ్డపేరు తీసుకొచ్చాయి. ఈ విషయంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించాడు. ప్రభాస్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ట్వీట్లు చేశాడు. ఒక వీడియో షేర్ చేసి “ఇది దీపావళి సెలబ్రేషన్ కాదు.. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ మ్యాడ్‌నెస్. తమ హీరో సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లోనే టపాసులు కాల్చి తగలబెడుతున్నారు” అంటూ ట్వీట్ చేశాడు. తర్వాత “సెలబ్రేటింగ్ దీపావళి ప్రభాస్ ఫ్యాన్స్ స్టైల్” అంటూ మరో ట్వీట్ చేశాడు. అయితే ఒక్క రామ్ గోపాల్ వర్మకే కాదు.. చాలా మందికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. థియేటర్లలో టపాసులు కాల్చాలనే ఆలోయన ఎలా వచ్చిందో అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఒక పక్క సినిమా ప్రదర్శిస్తుంటే అదే థియేటర్‌లో ఎలా క్రాకర్స్ కాలుస్తారంటూ పెదవివిరుస్తున్నారు.
No it’s not Diwali celebration ..It’s the madness of #Prabhas fans celebrating by burning a theatre while his film is running on the screen pic.twitter.com/lbYje0t356
— Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022
Celebrating Diwali #Prabhas fans style https://t.co/ocr0OUEet6
— Ram Gopal Varma (@RGVzoomin) October 23, 2022
My Name is Billa 😎🥵🔥🔥🔥🔥#Billa4K #Billa4KCelebrations pic.twitter.com/vpy8OtS1Cx
— Rdj… (@Rdj0000) October 23, 2022
Shadnagar theatre lo Billa 4k… Rebels on 🔥🔥🔥 pic.twitter.com/jnlkHq8rzL
— Lovely Vicky (@vickylovely394) October 23, 2022
Khammam Rebel fans Mass Euphoria 💥💥🥵🥵🌋🤙 At aditya Theater #Prabhas #HappyBirthdayPrabhaspic.twitter.com/eAlkk6wiNk
— KHAMMAM PRABHAS FC (@KMMPrabhasFc) October 23, 2022
#Billa4K Today morning show at Rajahmundry 🥵🔥…
Papers not allowed, 5 guards 🤣#Prabhas pic.twitter.com/71BBCTMn2N
— రుద్ర ᵀᴹ (@Rudra___1) October 24, 2022