బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్ యాక్ట్ 1985 (ఎన్‌డీపీఎస్) చట్టంలోని పలు నిబంధనలు అభియోగాలుగా ఎన్‌సీబీ నమోదు చేసింది. ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జైశ్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రాలను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖెడే తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ప్రస్తుతం ముంబై కేంద్ర కారాగారంలో రిమాండులో వున్నాడు.
ఇక ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకులు రాంగోపాల్ వర్మ. సినీ, రాజకీయ, క్రీడా రంగాల్లోని వ్యక్తులపై సమయం, సందర్భం లేకుండా తనకు తోచిన ట్వీట్ చేస్తూ ఎప్పుడూ కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటారు. తాజాగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై వరుస ట్విట్స్ తో ఊదరగొడుతున్నాడు వర్మ. సూపర్ స్టార్ కుమారుడిని సూపర్ డూపర్ స్టార్ గా మార్చినందుకు ఎన్సీబీకి షారుఖ్ అభిమానులు కృతజ్ఞతలు చెప్పాలన్నారు.
ఎన్సీబీ నిర్మాణ సారథ్యంలో మీడియా డైరెక్షన్ లో ఆర్యన్ ఖాన్ హీరోగా ‘రాకెట్’ అనే సినిమా తెరకెక్కుతోందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి నుంచి కన్నా జైలు, ఎన్సీబీ నుంచి చాలా నేర్చుకున్నానంటూ ఆర్యన్ భవిష్యత్ లో చెబుతాడని అన్నారు. మీడియా, ఎన్సీబీ అసాధారణ రీతిలో ఆర్యన్ ఖాన్ ను లాంచ్ చేశాయని చెప్పారు. ఏదైమైనా వర్మ చేస్తున్న ట్విట్స్ షారూఖ్ ఖాన్ కి పుండు మీద కారం జల్లినట్టు ఉందని అంటున్నారు నెటిజన్లు.
The launch of @iamsrk ‘s son has 4 phases as in the son of @iamsrk ,the director who does his first film ,the NCB in general and ofcourse the media for giving such an EXTRAORDINARY LAUNCH even before his father could ,but NCB tops the list 🙏
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2021
All genuine and intelligent fans of @iamsrk should thank the great NCB for making their SUPER STAR’s son into a SUPER DUPER STAR ..As a @iamsrk ‘s genuine fan I just want to shout JAI NCB 🙏💐💪💃🏿
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2021
Film TITLE :
ROCKET
Launching as Hero ,Aryan Khan S/O @iamsrk
PRODUCED by NCB
Co produced by some political parties
DIRECTED by MEDIA
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2021