సంచలనాలకు మారు పేరుగా నిలిచే దర్శకుడు ఆర్జీవీ. నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు బర్త్‌డే సందర్భంగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే వ్యక్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే.. వెంటనే అందరికి గుర్తుకు వచ్చే పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నిత్యం ఏదో ఒక వివాదంలో దూరడం అంటే ఆర్జీవీకి సరదా. సినిమా, రాజకీయ నాయకులు గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం.. లేదంటే చిల్లర ఇంటర్వ్యూలు, అమ్మాయిలు, ఆర్టిస్ట్‌లతో హగ్గులు, పెగ్గులు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేయడం ఆర్జీవీకి అలవాటు. కొన్ని రోజుల క్రితం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణితో కలిసి.. ఆర్జీవీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇక తాజాగా మరో సంచలన ట్వీట్ చేసి.. వార్తల్లో నిలిచాడు ఆర్జీవీ. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్‌డే సందర్భంగా ఆర్జీవీ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
నేడు అనగా ఏప్రిల్ 20, గురువారం చంద్రబాబు నాయుడు బర్త్‌డే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురు టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లు.. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. బర్త్‌డే సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు నాయుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే బర్త్ డే గిఫ్ట్ కూడా ఇస్తున్నానని.. మధ్యాహ్నం 12 గంటలకు సర్‌ప్రైజ్ ఉందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
‘‘చంద్రబాబు నాయుడు గారికి బర్త్‌డే శుభాకాంక్షలు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సాంగ్ విడుదల చేస్తాను. ఆ పాటను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా తయారు చేయించాను. ఈ #CbnSicko పాటలోని లిరిక్సు, వాయిస్లు , మ్యూజిక్ అన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసినవే.. ఇందులో ఒక వాయిస్ మాత్రం నా గొంతును పోలి వుంటుంది.. అయితే అది నాది కాదని’’ తెలిపాడు ఆర్జీవీ. తాను విడుదల చేయబోయే పాటని.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిందేనని పంచభూతాల మీద ప్రమాణం చేశాడు.. సాంగ్ రిలీజ్ 12 గంటలకి ఉంటుందంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మరి చంద్రబాబుకు ఆర్జీవీ ఇచ్చే బర్త్‌డే గిఫ్ఠ్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A very happy birthday sir @ncbn 💐💐💐 సాంగ్ రిలీజ్ today 12 గంటలకి 💐💐 Song done by #Artificial intelligence 💐💐💐 pic.twitter.com/Y8YyjvGtUV
— Ram Gopal Varma (@RGVzoomin) April 20, 2023