కాంట్రవర్సీ కింగ్, వివాదాస్పద డైరెక్టర్ ఇప్పటికే మీకు అర్థమై పోయుండాలి చెప్పేది ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ గురించి అని. ఆయన కావాలని కాంట్రవర్సీ చేస్తారో.. ఆయన మాట్లాడితేనే కాంట్రవర్సీ అయ్యిద్దో ఎవరికీ తెలీదు. ఏదైనా ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. ‘మా’ అసోసియేషన్ ఒక సర్కస్ అని వర్మ కామెంట్ చేయడం.. దానికి మనోజ్ రిప్లై ఇవ్వడం తెలిసిందే. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ఎప్పటిలాగానే ఆసక్తికర, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూనే కొన్ని ప్రశ్నలు కూడా సంధించాడు వర్మ. అసలు మా అసోసియేషన్ ఎందుకంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇదీ చదవండి: టీమిండియాలో ఏం జరుగుతోంది? మెంటర్ ధోనీ మాట నెగ్గడం లేదా?
అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమా వాళ్లంటే ఎనలేని గౌరవం ఉండేదని ఎన్నికల తర్వాత అది కాస్తా పోయిందని వర్మ కామెంట్ చేశాడు. ఎవరిని ఉద్దేశించి తాను మాట్లాడలేదని వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఎవరూ కూడా కావాలని ప్లాన్ చేసి ఈ పరిస్థితిని తీసుకురాలేదని.. అది అనుకోకుండా అలా జరిగిపోయిందని తెలిపాడు. ‘అసలు మా అసోసియేషన్ ఎందుకు? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఒక భవనం ఎందుకు? వీళ్ల ఎన్నికలకు అసలు మేనిఫెస్టోలు ఎందుకు?’ అంటూ రామ్ గోపాల్ వర్మ సూటి ప్రశ్నలు సంధించాడు. హౌసింగ్ సొసైటీల్లోనే మా అసోసేషన్‌తో పోలిస్తే 50 రెట్లు ఎక్కవ మంది ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనానికి, ఎన్నికలకు లింకు ఏంటని క్వశ్చన్ చేశాడు. 600 ఓట్ల కోసం హీరోలు జీరోలుగా మారిపోయారని వర్మ ఎద్దేవా చేశాడు. వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్మ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.