వర్మ ఇంటర్య్వూలో కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోతారు అనే భావన ఇండస్ట్రీలో కలిగింది. ఇక తాజాగా ఏప్రిల్ 7న వర్మ బర్త్ డే కావడంతో.. ఓ అమ్మాయి మాత్రం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ ఆ యువతి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో మరో అమ్మాయిని వర్మ ఫేమస్ చెయ్యబోతున్నాడా అంటూ.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ నటి ఎవరో ఇప్పుడు తెసుకుందాం.
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.. వివాదాలకు లాండ్ మార్క్ గా నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ. కొన్ని కొన్ని సందర్భాల్లో గొప్ప మేధావిగా కనిపిస్తాడు, అంతలోనే మరీ ఇంతలా దిగజారాడు ఏంటి అని అనిపిస్తాడు ఆర్జీవీ. ఇక ఆర్జీవీ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన బ్యూటీలు.. కెరీర్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. వారిలో బిగ్ బాస్ బ్యూటీలే ఇద్దరు ఉన్నారు. ఒకరు ఆరియానా అయితే.. మరొకరు అషు రెడ్డి. వీరిద్దరిని కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఫేమస్ చేశాడు ఆర్జీవీ. దాంతో వర్మ ఇంటర్య్వూలో కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోతారు అనే భావన ఇండస్ట్రీలో కలిగింది. ఇక తాజాగా ఏప్రిల్ 7న వర్మ బర్త్ డే కావడంతో.. చాలా మంది అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందులో ఓ అమ్మాయి మాత్రం స్పెషట్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ ఆ యువతి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఆమె కూడా ఓ నటి కావడం విశేషం. దాంతో మరో అమ్మాయిని వర్మ ఫేమస్ చెయ్యబోతున్నాడా అంటూ.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఎవరా అమ్మాయి అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజనులు. మరి ఆ నటి ఎవరో ఇప్పుడు తెసుకుందాం.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఉన్న చోట వివాదం ఉంటుంది. లేదా వివాదం ఉన్న చోట ఈ పేరు ఉంటుంది. ఇది నేను చెప్పే మాట కాదు.. అతడి గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా ఇదే మాట చెబుతారు. ఇక కొన్ని రోజుల క్రితం అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చనిపోయిన చిన్నారి తరుపున పోరాడి, ఆ కుటుంబానికి పరిహారం అందేలా చేశాడు. దాంతో వర్మ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఇక వర్మ అప్పుడప్పుడు అమ్మాయిలతో చేసే బోల్డ్ ఇంటర్య్వూలతో అందరికి షాక్ ఇస్తుంటాడు. ఆ ఇంటర్వ్యూ అనంతరం ఆ బ్యూటీలకు ఉన్న క్రేజ్ కాస్తా అమాంతం పెరిగిపోతుంది. ఇందుకు సాక్ష్యాం అరియానా, అషు రెడ్డి, ఇనయ సుల్తానాలు. అయితే ఇనయను ఒక్క వీడియోతో సెలబ్రిటీని చేశాడు వర్మ. దాంతో ఆ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.
తాజాగా ఏప్రిల్ 7న బర్త్ డే జరుపుకుంటున్నాడు వర్మ.. దాంతో సెలబ్రిటీలు అతనికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఓ తమిళ నటి మాత్రం వర్మకు రెండు కుందేలు పిల్లలను ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పింది. దాంతో వర్మ ఫుల్ హ్యాపీగా ఫీలైపోయాడు. ఇది నా బర్త్ డేకి వండర్ ఫుల్ గిఫ్ట్ అంటూ ఆ నటితో దిగిన ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. దాంతో నెక్ట్స్ వీడియో ఈ తమిళ నటితోనే ఉండబోతుందా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆ నటిపేరు చెప్పలేదు కదూ.. ఆమె పేరు మసూం శంకర్.. తమిళనాట మంచి పేరున్న నటి. 2016లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 2019లో తమిళంలో వచ్చిన 90ML సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న మసూం శంకర్ వర్మకు బర్త్ డే విషెస్ చెప్పడంతో.. ఏంటి సంగతి అంటూ ఆరా తియ్యడం మెుదలు పెట్టారు. వీరిద్దరిని ఇలా చూడటంతో.. ఇక నెక్ట్స్ వీడియో ఈమెతోనే ఉంటుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.