ఒకప్పుడు విదేశాల్లో విడాకుల కల్చర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనదేశంలోనూ వైవాహిక బంధానికి ముగింపు పలికే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..!
భారత్‌లో విడాకులు కోరుకుంటున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఒకప్పుడు విదేశాల్లో ఈ కల్చర్ బాగా కనిపించేది. ఇప్పుడు మన దేశంలోనూ ఈ సంస్కృతి పెరుగుతోంది. విడాకులు తీసుకుంటున్న వారిలో వృద్ధాప్యానికి చేరువైన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. అపోహలు, అనర్థాలతో చాలా మంది వైవాహిక బంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య జరిగే వాగ్వాదాలు.. ఆ సమయంలో బంధువులు, సన్నిహితులు ఇచ్చే ఉచిత సలహాలు వారి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇటీవల 50 ఏళ్లు దాటిన వారిలో డైవర్స్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు.
విడాకుల కేసులు ఈమధ్య పెరిగిపోవడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. దీనిపై ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం మీద మాట్లాడారు. ‘దేశంలో వంద శాతం విడాకులు పెరగడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నాలెడ్జ్ లేకపోవడమే కారణం. మనిషి చేసే పెద్ద తప్పు ఏంటంటే వేరే వాళ్ల కోసం బతకడం. నేను వివాహ బంధం నుంచి విడిపోయాను, కాబట్టి హ్యాపీగా ఉన్నాను’ అని వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఆర్జీవీ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొంత మంది నెటిజన్స్ మాత్రం ఆయన కామెంట్స్‌తో ఏకీభవించడం లేదు. మరి.. విడాకులపై రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.