దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 10 సంవత్సరాల క్రితం వరకు వర్మ పేరు చెబితే.. అతడు తీసిన సినిమాలు, టేకింగ్ స్టైల్ వంటి విషయాల గురించి జనాలు మాట్లాడుకునేవారు. సినిమాలకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు.. రామ్ గెపాల్ వర్మ అంటే.. ఓ రోత.. చీడపురుగు.. సమాజికి పట్టిన బూజు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సమాజం భ్రష్టు పట్టిపోతుంది అనే స్థాయిలో విమర్శలు మూటకట్టుకున్నాడు. ప్రస్తుతం వర్మ అంటే వోడ్కా, సెక్స్ ఇవి రెండే పదాలు వాడుతున్నారు.
ఏదో ఓ రకంగా వార్తల్లో నిలవడం కోసం వర్మ చేసే కామెంట్స్, పనులు చూస్తే.. ఎవరికైనా కోపం వస్తుంది. ఇక తాజాగా.. అషు రెడ్డితో వర్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ.. ఆ సమయంలో అషుతో ఆయన వేసిన పిచ్చి వేషాలు చూసి జనాలకు వర్మ మీద మరింత ఆగ్రహం పెరిగింది. చాలా మంది దీనిపై ఘాటు విమర్శలు చేశారు. అయితే విచిత్రంగా.. మన సమాజంలో కొందరు వర్మ చేసే పనులు, అతడి వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారు.. ఫాలో అవుతారు. సరే మంచో, చెడో.. మనం మాత్రం ప్రతి రోజు ఏదో విధంగా వర్మ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈ క్రమంలో వర్మ వ్యక్తిత్వం గురించి, అతడి ప్రవర్తన.. ప్రస్తుతం అతడిపై వస్తున్న విమర్శల గురించి ఆయన తల్లి సూర్యావతి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఆ వివరాలు..
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..రామ్‌గోపాల్ వర్మకు సంబంధించి అనేక విషయాల గురించి వెల్లడించారు ఆయన తల్లి. ‘‘జీఎస్‌టీ సినిమాను రాము పక్కన కూర్చుని చూశాను. తను ఇతరుల ఇష్టాలను గౌరవిస్తాడు. ఇక తనవరకు వస్తే.. తనను తాను మార్చుకోకపోవడమే వర్మకు ఇష్టం. ఇక తను ఇంటికి రాగానే నేను కనిపించాలి. లేకపోతే.. నచ్చదు. నన్ను చూడగానే.. తన కళ్లల్లో ఓ మెరుపు కనిపిస్తుంది. తనకు మారాలని మనునులో ఉంటేనే.. మారతాడు లేకపోతే ఎవ్వరం ఎన్ని చెప్పినా మారడు కదా. రాము విషయానికి వస్తే.. తను ఈ జన్మలో మారడు’’ అన్నారు .
‘‘వర్మ గురించి చాలా మంది ఎన్నో కామెంట్స్ చేస్తారు. రాము ఎలాంటి వాడో నాకు తెలుసు.. కాబట్టి.. తన విషయంలో నా ఆలోచన ఒకలా ఉంటుంది.. తను ఎవరో నాకు తెలియకపోతే.. అప్పుడు నా లోచనలు కూడా వేరేలా ఉంటాయి కదా’’ అన్నారు. ఇక ఇంటర్వ్యూ సందర్భంగా పలు సందర్భాల్లో.. ఆమె కొడుకును తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. మరి ఆర్జీవీ గురించి ఆయన తల్లి సూర్యావతి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి