అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో ప్రాణాలు వదిలిన చిన్నారి ప్రదీప్ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. దాడి ఘటనపై ట్వీటర్ వేదికగా స్పందించిన వర్మ.. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రదీప్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఒంటరిగా రోడ్డుపై ఉన్న బాలుడిని విచక్షణా రహితంగా కరచి బాలుడి ప్రాణాలు తీశాయి ఆ వీధి కుక్కలు. ఇక అప్పటి నుంచి వీధికుక్కలు కరచిన సంఘటలను ఈరోజు వరకు పట్టణంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. పరిపాలనా విధానంపై, వ్యవస్థపై, మేయర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుమన్ టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్య్వూలో అంబర్ పేట్ కు వీధికుక్కల దాడిపై తనదైన శైలిలో స్పందించాడు.
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు చెప్పగానే అందరికి వివాదాల డైరెక్టర్, కాంట్రవర్సీ క్రియేటర్ అనే పదాలు వినిపిస్తాయి. కానీ తాజాగా అంబర్ పేటలో చిన్నారి ప్రదీప్ ను వీధికుక్కలు బలితీసుకున్న సంఘటనలో చిన్నారి కుటుంబం తరపున పోరాడాడు. వర్మ పోరాట ఫలితంగానే జీహెచ్ఎంసీ ప్రదీప్ కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం దక్కింది అనేది కాదనలేని వాస్తవం. ఈనేపథ్యంలోనే మరోసారి తనదైన శైలిలో ఈ ఘటనపై విరుచుకుపడ్డారు RGV. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.
“నేను ప్రపంచలో చూసిన అతి దారుణ ఘటనల్లో ఈ వీధికుక్కల దాడి తొలి స్థానంలో ఉంటుంది. ఇక ఈ ఘటనపై సెలబ్రిటీలు స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. అంబర్ పేట ఘటన జరగగానే జీహెచ్ఎంపీ నగరంలో దాదాపుగా 5 నుంచి 6 లక్షల కుక్కలు ఉన్నట్లుగా వారు లెక్కలు చెప్పారు. అయితే వారు ఏ ఆధారంగా చెప్పారు అనేదే ఇక్కడ అసలు ప్రశ్న” అని వర్మ అన్నారు. ఇక మరికొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కొంత మంది కుక్క మనదగ్గరికి వస్తే కదలకుండా అలాగే నిలబడాలి అని కొందరు చెబుతున్నారు. ప్రపంచంలో ఎవడైనా అలా చేస్తాడా అని వర్మ అసహనం వ్యక్తం చేశాడు. నేను వీధికుక్కల గురించి మాట్లాడుతుంటే.. కొందరు పెంపుడు కుక్కల గురించి చెబుతున్నారు ఏంటి మండిపడ్డారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.