తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మరణం టాలీవుడ్ ను ఇంకా వేధిస్తూనే ఉంది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని చాలా మంది ప్రముఖులు అతనితో గడిపిన క్షణాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని మరోసారి పంచుకునే ప్రయత్నం చేశారు.
ఆయనతో వర్మకు ఉన్న అనుబంధాన్ని తాజగా ఓ వీడియో రూపంలో తెలుపుతూ ఆయన రాసిన పాటను స్వయంగా పాటను పాడారు. వర్మ తాజాగా “సిరివెన్నెల సీతారామా శాస్త్రికి ఒక ముద్దు” అనే పేరుతో కూడిన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన “ఎప్పుడూ ఓప్పు కోవద్దురా ఓటమి” అనే పాట పడుతూ వర్మ మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత తన పక్కనున్న సిరివెన్నెల ఫోటోకు మద్దు పెడుతూ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.