టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ అంటారు. ఒకప్పుడు కామెడీ, హర్రర్, మాఫీయా చిత్రాలు తీస్తూ ఇప్పుడు బయోపిక్ లపై ఎక్కువ దృష్టి సారించారు రాంగోపాల్ వర్మ. ఆ మద్య రక్త చరిత్ర చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన తాజాగా తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులైన కొండా దంపతులపై బయోపిక్ చేసేందుకు సిద్దమయ్యారు.
ఆ పోస్టర్‌లో కొండా మురళి అగ్రెసివ్ లుక్ చూయించారు. గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్థం కాలే? అంటూ పోస్టర్‌పై కామెంట్ మెన్షన్ చేశారు. వివాదాలకు కేంద్ర బిందువైన రాంగోపాల్ వర్మ తాజాగా వరంగల్ వెళ్లి మరో కొత్త వివాదానికి కేంద్రమయ్యారు. వరంగల్‌లో మైసమ్మ గుడిలోకి వెళ్లి రచ్చ చేశారు. వరంగల్‌లో ఓ ర్యాలీకి ప్లాన్ చేశారు. కానీ పోలీసులు మాత్రం దానికి పరిమిషన్ ఇవ్వలేదు. దానికి ఆయన హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు తన సినిమా ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ఉండి పబ్లిసిటీ కల్పించినందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరికి వచ్చిన వర్మ అక్కడి కోటగండి మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు.
మద్యం బాటిల్ తో గర్భ గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహానికి విస్కీ తాగించినట్లు ఫొటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘నేను కేవలం వోడ్కా నే తాగుతా. కానీ మైసమ్మ దేవతకు విస్కీ తాగించా’ అని ట్వీట్ చేశారు. దీనిపై కొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇక వర్మ మారడా అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. అప్పుడే తన పబ్లిసిటి స్టంట్ మొదలు పెట్టారని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Though I only drink Vodka, I made the Goddess Maisamma drink Whisky 😃 pic.twitter.com/rcwHc2DSde
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021
CHEERS! 🍾🍾🍾 pic.twitter.com/WXDMdZ4PcC
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021