వివాదాలకు కేరా ఆఫ్ అడ్రస్.. మనసులో ఏదనుకుంటే అది ఓపెన్ గా చెప్పేయడం.. తన ఎంజాయ్ మెంట్ ను సోషల్ మీడియాలో పంచుకోవడం.. ఇప్పటికే అర్థమైపోయుండాలి చెప్పబోయేది రామ్ గోపాల్ వర్మ గురించి అని. ఆయనను ఇంటర్వ్యూలు చేసిన యాంకర్లు అరియానా, అషురెడ్డికి కూడా ఎంత ఫేమ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఎవరు ఏమనుకుంటారు? ఈ మాట చొప్పొచ్చా లేదా? అలాంటి ఆలోచనలు ఏం ఉండవు. మనసుకు అనిపిచ్చింది పైకి చెప్పేస్తాడు. సోషల్ మీడాయా వేదికగా షేర్ చేస్తుంటాడు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
తాజాగా రామ్ గోపాల్ వర్మ హీరోయిన్, నిర్మాత ఛార్మీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందుకు ‘సర్కారీతో డ్రిక్ పార్టీ’ అంటూ మందు గ్లాసు పట్టుకున్న ఛార్మీ ఫొటోను షేర్ చేశాడు. అందుకు ఛార్మీ కూడా స్పందించడం మరో విశేషం. కేవలం స్మైలీస్ ఏమోజీలు పెట్టింది. ఆర్జీవీ పోస్టు పెట్టిన కాసేపటికే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను ఎప్పుడూ చట్టానికి లోబడే తనకు నచ్చిన రీతిలో బతకుతున్నానంటూ రామ్ గోపాల్ వర్మ గతంలోనూ చాలాసార్లు చెప్పాడు. ఆర్జీవీ పోస్టుపై నెటిజన్లు ‘ఎంజాయ్ మెంట్ అంటే నీదే సామీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు.