టాలీవుడ్ లో ఆర్జీవీ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ప్రముఖ దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన జోనర్ ను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి వర్మ. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఆయనకే తెలియదని కొందరు అంటుంటారు. ఎప్పుడూ వివాదలను కోరి తెచ్చుకుంటాడు అని కొందరి అభిప్రాయం. ఇటీవల సిరివెన్నెలపై ఆర్జీవీ తనదైన స్టైల్ లో ప్రేమను వ్యక్తం చేశారు. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. గతంలో ఒకసారి ఓ కమెడియన్ మనువడిగా మొదలై స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడంటూ బన్నీ పై రామ్ గోపాల్ వర్మ్ ప్రశంసించిన సంగతి తెలిసింది.
తాజా అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-1’ ట్రైలర్ విడుదలైన సందర్భంగా బన్నీని మరోసారి ఆకాశానికేత్తాడు ఆర్జీవీ. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప-1.ఇందులో రష్మికా మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. సోమవారం రిలీజైన పుష్ప-1 ట్రైలర్ అందరి ఆకట్టుకుంది. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన పుష్ప మూవీ పలు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మంగళ శ్రీను గా సునీల్, దాక్షాయణి గా అనసూయ చేసిన పాత్రలతో వచ్చిన ఫోటో లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇంక సినిమాల్లో వారి క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందని ఆసక్తిగా ఉన్నారు సినీ ప్రియులు. సోమవారం విడుదలైన పుష్ప-1 ట్రైలర్ పై పలువురు స్పందించారు.
రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. “తెలుగులో రియాలిస్టిక్ క్యారెక్టర్ చేయడానికి ఏమాత్రం భయపడని ఒక్కేఒక్కడు సూపర్ స్టార్ అల్లు అర్జున్” అని వర్మ అన్నారు. ఇలాంటి పాత్రలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా ‘పుష్ప’ అంటే ‘పుష్పం’ కాదని… అది ఫైర్ అని ట్రైలర్ లో బన్నీ చెప్పిన డైలాగ్ ను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆర్జీవీ కామెంట్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.