రామ్ గోపాల్ వర్మ.. వివాదాలకు కేరాప్ అడ్రెస్. ఈయన వివాదాల చుట్టూ తిరుగుతారా.. లేక వివాదాలే ఈయన చుట్టూ తిరుగుతాయా అర్థం కాదు. కానీ నిత్యం ఏదో ఓ కాంట్రవర్సిలో తలదూరుస్తూ.. వార్తల్లో నిలుస్తాడు. కొన్ని రోజులుగా బాలీవుడ్‌ని ఏకి పారేస్తున్నాడు. అంతకు ముందు సినిమా టికెట్ల ధర అంశంలో ఏపీ రాజకీయ నాయకులతో పెట్టుకున్నాడు. అసలు ఆయన వేలు పెట్టని రంగమంటూ ఏది ఉండదేమో. ఇక తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు రామ్ గోపాల్ వర్మ. సాధారణంగానే.. కాంట్రవర్సీలకు కెరాఫ్ అడ్రెస్‌గా ఉండే రామ్ గోపాల్ వర్మ.. ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. వామ్మో ఈ ఊహే భయంకరంగా ఉంది కదా. మనకే కాదు.. ఆయనకు కూడా ఇదే ఫీలింగ్ అంట. రాజకీయాలా.. అబ్బో నా వల్ల కాదు అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ఆర్జీవీ స్పందిస్తూ.. ‘‘బుద్ది ఉన్నవాడు ఎవడు నాకు ఓటేయ్యడు.. ఎందుకంటే.. నా బతుకు నేను బతుకుతాను.. వేరే వారి గురించి ఆలోచించను. ఓ రాజకీయ నాయకుడికి ఉండకూడని అతి ముఖ్యమైన లక్షణం ఇదే. నేను జనాలకు ఏం చేయననే విషయం వారికి కూడా బాగా తెలుసు. అందుకే నాకు ఎవరు ఓటేయరు. అదంతా పక్కన పెడితే.. అసలు నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదు’’ అని చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
ఇది కూడా చదవండి: RGV సర్ నేను చనిపోదాం అనుకున్నా. మీ ఇంటర్వ్యూ చూసి ఆగిపోయా!వర్మ ఆన్సర్ చూసిన జనాలు.. ‘‘బతికించావ్.. లేకపోతే నీలాంటి వాడిని రాజకీయాల్లో అస్సలు ఊహించలేం.. అక్కడ కూడా అంతా నా ఇష్టం అంటావని భయపడ్డాను.. నీకు రాజకీయాలు సెట్ కావు.. ఓడ్కా తాగి పడుకో.. బోర్ కొడితే రెండు ట్వీట్లు వేయ్’’ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. నిజంగానే తనకు నచ్చినట్లే బతికే వర్మకు రాజకీయాలు సెట్ కావు.. ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిని ఏ పార్టీలు కూడా అంగీకరించవు. అన్నింటికన్నా ముఖ్యం.. అసలు ఆర్జీవీకి రాజకీయాలపై ఆసక్తి లేకపోవడం. మరి రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.