సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉండటం అనేది చాలా కామన్. వారు ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉంటూ.. రక్షణ కల్పిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇండియాలో కనిపించిన సెక్యూరిటీలు.. ఒక్కోసారి ఫారెన్ లో అడుగు పెట్టగానే కనిపించరు. తాజాగా అమెరికా వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన ఓ స్పెషల్ బాడీ గార్డ్ మెరిశాడు. అతని హైట్, పర్సనాలిటీ చూస్తే..
సెలబ్రిటీలకు బాడీ గార్డ్స్ ఉండటం అనేది చాలా కామన్. వారు ఎక్కడికి వెళ్లినా వెన్నంటే ఉంటూ.. రక్షణ కల్పిస్తూ ఉంటారు. సెలబ్రిటీలను ఫ్యాన్స్ దగ్గరగా చూడలేకపోయినా.. బాడీ గార్డ్స్ ఎప్పుడూ దగ్గరుండి మరీ కాపాడుతుంటారు. అయితే.. సెలబ్రిటీలు లోకల్ ఏరియాలలో ఉన్నప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు బాడీ గార్డ్స్ మారుతుంటారు కావచ్చు. ఎందుకంటే.. ఇండియాలో కనిపించిన సెక్యూరిటీలు.. ఒక్కోసారి ఫారెన్ లో అడుగు పెట్టగానే కనిపించరు. కొన్నిసార్లు సెలబ్రిటీలు ఎక్కడికైతే వెళ్తారో.. అక్కడి స్థానికులను బాడీ గార్డ్స్ గా పెట్టుకోవడం లేదా అక్కడి ప్రభుత్వమే బాడీ గార్డ్స్ ని కల్పించడం గురించి వింటుంటాం.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్లి.. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ అనే లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న విజువల్స్, ఫ్యాన్స్ సందడి అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. వీటితో పాటు చరణ్ న్యూయార్క్ లో కారు దిగేటప్పుడు.. డోర్ తీసిన సెక్యూరిటీ ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారాడు. అవును.. సెక్యూరిటీ ఏం చేశాడు? తన పని తాను చేశాడని మీకు అనిపించవచ్చు. ఇక్కడ హైలైట్ అవుతోంది.. చరణ్ పక్కన సెక్యూరిటీగా ఉన్న వ్యక్తి హైట్. చరణ్ కారు దిగేటప్పుడు డోర్ తీసిన సెక్యూరిటీ పర్సనాలిటీ, హైట్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. బహుశా ఆ వ్యక్తి అమెరికాలో చరణ్ కి స్పెషల్ బాడీ గార్డ్ అయ్యుండొచ్చు. కానీ.. అతని హైట్ ఏంటి అంతుంది? అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ప్రస్తుతం చరణ్ పక్కన సెక్యూరిటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Entire video of our OG #GlobalStarRamCharan @AlwaysRamCharan 🔥🦁#ManOfMasessRamCharan #Ramcharan #GoodMorningAmerica pic.twitter.com/25WWZIcERb
— SivaCherry (@sivacherry9) February 22, 2023