మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక స్టార్ గా ఎంత ఎదిగిన బిడ్డగా ఒదిగి ఉన్న తీరు అద్భుతం. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.. తాజాగా రామ్ చరణ్ తన తల్లి పుట్టిన రోజునాడు షేర్ చేసిన ఓ ఫోటో..
ఇండస్ట్రీలో ఒక్క సినిమా హిట్ అయితే చాలు కొంత మంది హీరోలు కాలర్ ఎగరేస్తూ.. మన కన్నా తోపులు ఎవరూ లేరనుకుంటారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం ఎంత స్టార్ డమ్ ఉన్నా.. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాగానీ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. అలాంటి స్టార్ హీరోలలో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ తనయుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. ఒక్కొమెట్టు ఎక్కుతూ.. RRR మూవీతో హాలీవుడ్ ఇండస్ట్రీని టచ్ చేశారు. అయినప్పటికి తల్లిదండ్రు చాటు బిడ్డగానే, ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నారు. ఇందుకు నిదర్శనం రామ్ చరణ్ తల్లి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోనే ఉదాహరణ.
రామ్ చరణ్.. మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ తన నటనతో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. అటు మెగాస్టార్ తనయుడిగా, ఇటు స్టార్ హీరోగా ఉన్నప్పటికీ ఎంత ఎదిగినప్పటికీ ఒదిగే ఉన్నారు రామ్ చరణ్. తాజాగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మనాన్నలతో దిగిన ఓ పిక్ ను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు రామ్ చరణ్. ఇక ఆ పిక్ లో అమ్మనాన్నల కాళ్ల దగ్గర కూర్చుని ఆనందంతో మురిసిపోతున్నారు. అదీకాక ఈ రోజు మెగాస్టార్ సతీమణి సురేఖ పుట్టిన రోజు కూడా కావడంతో.. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ విష్ చేశారు రామ్ చరణ్.
ఈ క్రమంలోనే అభిమానులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ గా ఎంత ఎదిగినప్పటికీ బిడ్డగా రామ్ చరణ్ ఒదిగే ఉన్నారు. తల్లి పుట్టిన రోజు నాడు ఆశీర్వాదం తీసుకుని కాళ్ల దగ్గర కూర్చున్న తీరును చూస్తేనే అర్ధం అవుతుంది రామ్ చరణ్ ప్రేమ ఎలాంటిదో, అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమాను చేస్తున్నారు. శంకర్ ఇండియన్ 2 సినిమాకు సంబంధించి నెల రోజుల పాటు షెడ్యూల్ ఉండటంతో రామ్ చరణ్ ఈ నెల రోజులు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది. మరి ఎంత ఎదిగినా బిడ్డగా ఒదిగి ఉన్న రామ్ చరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Happy Mahashivratri🙏🏼!! & Happiest Birthday to my darling Amma!!❤️ pic.twitter.com/JJuyRRKvfM
— Ram Charan (@AlwaysRamCharan) February 18, 2023