కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్’. 2018లో చాప్టర్ 1గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టుకుంది. ఇక ఒక్క సినిమాతోనే అటు హీరో యష్, ఇటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నారు.
ఇప్పుడు కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా ‘కేజీయఫ్ చాప్టర్ 2’ రాబోతున్న సంగతి తెలిసిందే. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. ఆదివారం (మార్చి 27న) కేజీయఫ్ 2 ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ లాంచ్ కోసం మేకర్స్ ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేశారు.
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమానికి కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా రానున్నారు. ఇక కేజీయఫ్ 2 తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనుండటం విశేషం. ఈ విషయాన్ని కేజీఎఫ్ ప్రొడక్షన్ హోంబాలే ఫిల్మ్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. అదేవిధంగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు.
ఈ సినిమా ట్రైలర్ సాయంత్రం 6.40 గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ కానుంది. తమిళ ట్రైలర్ స్టార్ హీరో సూర్య రిలీజ్ చేయనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్ 2’ సినిమాని హోంబాలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా.. బాలీవుడ్ స్టార్స్ రవీనా టాండన్, సంజయ్ దత్.. ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు నటించారు. మరి కేజీఎఫ్ 2 సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
We are Elated to have the Mega Powerstar @AlwaysRamCharan to launch our #KGFChapter2 Telugu trailer on his birthday. 🤩#HBDRamCharan #KGFChapter2TrailerDay#KGFChapter2Trailer at 6:40 PM today on https://t.co/QxtFZcv8dy (South) & https://t.co/4hTQltJuOv (Hindi) YT Channels. pic.twitter.com/QiXozlMvxC
— Hombale Films (@hombalefilms) March 27, 2022