Ram Charan: ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమా భారీ విజయం సాధించటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమా విజయంలో తమ వంతు పాత్ర పోషించిన టీం సభ్యులకు నిన్న తులం బంగారు కాయిన్, స్వీట్ బాక్స్ గిఫ్ట్‌గా ఇచ్చారు. తాజాగా, ఫ్యాన్స్‌కు కూడా ఆయన సర్‌ప్రైజ్ ఇచ్చారు. ముంబై, బాంద్రాలోని జైతే థియేటర్‌లో సందడి చేశారు. తెరపై కనిపిస్తున్న రామ్ చరణ్‌ను నేరుగా చూడటంతో అభిమానులు సంతోషంతో కేకలు పెట్టారు. ఆయన బయటకు వస్తున్నంత సేపు రామ్ చరణ్, రామ్ చరణ్ అంటూ కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ప్రాంతం మొత్తం చరణ్ పేరుతో మార్మోగింది. బయటికి వచ్చిన వెంటనే ఆయన కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, ‘‘ ఆర్‌ఆర్‌ఆర్’’ సినిమా పదవ రోజు కూడా భారీ వసూళ్లను సాధించింది. పదో రోజు ఏపీ, తెలంగాణలో RRR కలెక్షన్లు ఇలా ఉన్నాయి.. నైజాంలో రూ. 6.96 కోట్లు.. గుంటూరులో రూ. 85 లక్షలు.. క్రిష్ణలో రూ. 81 లక్షలు.. ఉత్తరాంధ్రలో రూ. 2.83 కోట్లు.. సీడెడ్‌లో రూ. 2.80 కోట్లు.. ఈస్ట్‌లో రూ.86 లక్షలు.. వెస్ట్‌లో రూ. 60 లక్షలు.. నెల్లూరులో రూ. 55.36 లక్షలు సాధించింది. టోటల్ షేర్ 18 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ సర్‌ఫ్రైజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.