మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే పార్టీ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. మొత్తం ఈవెంట్ ఏమో కానీ చరణ్-ఉపాసన మాత్రం ఒక్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు. ఇంతకీ ఆ ఫొటో స్పెషాలిటీ ఏంటో తెలుసా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. మొన్నటివరకు టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. రీసెంట్ గా ఆ మూవీలో పాటకు ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు కదా.. బర్త్ డే పార్టీ మాములుగా చేస్తే కిక్ ఏముంటుంది. అవును మీరు అనుకున్నది కరెక్ట్. హైదరాబాద్ లోని సోమవారం రాత్రి గ్రాండ్ గా పార్టీ జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్, ఇతర నటీనటులు చాలామంది వచ్చారు. కనువిందు చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడం ఏమో గానీ రామ్ చరణ్ ఫుల్ ఖుషీ మీదున్నాడు. ప్రస్తుతం శంకర్ తో ఓ సినిమా చేస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకని హైదరాబాద్ లో అదిరిపోయే రీతిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. చరణ్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించగా, ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన బ్లూ కలర్ డ్రస్ లో క్యూట్ గా కనిపించింది. ఈవెంట్ కు వెళ్లేముందు ఫొటోలకు పోజిలిచ్చిన ఈ జంట.. చూడముచ్చటగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఉపాసన బేబీ బంప్ కూడా ఈ ఫొటోల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో గుడ్ న్యూస్ కూడా వినబోతున్నామని తెలిసి మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి రామ్ చరణ్ నుంచి పాజిటివ్ న్యూస్ వస్తుండేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇక రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ తోపాటు హీరోలు వెంకటేష్, అడివి శేష్, విజయ్ దేవరకొండ, రానాతో పాటు పలువురు సందడి చేశారు. అక్కినేని నాగార్జున, కాజల్ తదితరులు తమ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఈ పార్టీలో పాల్గొన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే.. చరణ్-ఉపాసన లేటెస్ట్ పిక్ చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
Awwdorable click of the Lovely Couple from Mega Power ⭐ B’day Bash ♥️😍#HBDGlobalStarRamCharan#RamCharan #Upasana #CoupleGoals #TeluguFilmNagar pic.twitter.com/XXp2M31GXo
— Telugu FilmNagar (@telugufilmnagar) March 28, 2023