పుట్టబోయే బిడ్డ కోసం రాామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై చెర్రీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్.. మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటకు ఆస్కార్ రావడంతో.. రామ్ చరణ్ పేరు హాలీవుడ్ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. దాంతో త్వరలోనే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ ఖాయం అంటూ హింట్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? రామ్ చరణ్ 3 నెలలు షూటింగ్ ల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. పుట్టబోయే బిడ్డ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ సైతం ముగింపు దశకు వచ్చింది. అయితే రామ్ చరణ్ సినిమా షూటింగ్ ల నుంచి 3 నెలలు బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి ఓ బలమైన కారణం కూడా ఉంది. తన సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ తో ఉన్న విషయం మనందరికి తెలిసిన విషయమే.
ఇక ఉపాసన డెలివరీ టైమ్ లో చరణ్ పక్కనే ఉండాలని షూటింగ్ లకు మూడు నెలలు గ్యాప్ ఇచ్చాడు. ఏ భార్య అయిన తన డెలివరీ టైమ్ లో ఎవరు పక్కన ఉన్నా.. లేకున్నా భర్త ఉండాలని కోరుకుంటారు. దాంతో ఉపాసన కోసం, పుట్టబోయే బిడ్డకోసం రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక చెర్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పటి నుంచే ఇంత ప్రేమ చూసిపిస్తున్న చెర్రీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ బ్రేక్ గేమ్ ఛేంజర్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి పుట్టబోయే బిడ్డ కోసం, తన భార్య కోసం ఇంత ప్రేమను చూపిస్తున్న రామ్ చరణ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RamCharan to take 3-month break from May to welcome first child with wife #Upasana #GameChanger pic.twitter.com/LxlebsN7By
— Odisha Bhaskar (@odishabhaskar) April 19, 2023