తెలుగు సినీ ఇండస్ట్రీకి కేరాఫ్ అంటే.. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ, పద్మాలయా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో వంటి పేర్లు వినిపిస్తాయి. కానీ.., మన గతం అంత వైభవం ఏమి కాదు. అప్పట్లో మన తెలుగు సినిమాకి తెలుగునాట ఒక్క స్టూడియో కూడా లేని పరిస్థితి. ఇందుకే రాష్ట్రం విడిపోయిన చాలా ఏళ్ళ తరువాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై లోనే ఉండిపోయింది. సరిగ్గా.., అలాంటి సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు దైర్యంగా తొలి అడుగు వేసి.., హైదరాబాద్ లో అన్నీ వసతులతో అన్నపూర్ణ స్టూడియోని నిర్మించారు.
ఆ తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా పద్మాలయాని నిర్మించారు. ఇక.. తరువాత కాలంలో రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చాక బాలీవుడ్, హాలీవుడ్ మేకర్స్ కూడా ఇక్కడికే క్యూ కట్టారు.ఒక రకంగా ఇది మన తెలుగు సినిమా సాధించిన విజయమే. కానీ.., మీరు గమనించారా? ఈ స్టూడియోస్ అన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. దీంతో.., తెలుగు రాష్ట్రాల్లోని దూర ప్రాంతాల నుండి కూడా మేకర్స్ ఇక్కడికే క్యూ కట్టాల్సి వస్తుంది. దీంతో.., ఇప్పుడు మెగా పవర్ స్థార్ రామ్ చరణ్ వైజాగ్ లో ఓ భారీ స్టూడియోని నిర్మించడానికి సిద్దమయ్యాడట.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్ తక్కువ కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే.., మెగా పవర్ స్టార్ స్పీడ్ సినిమాల వరకే పరిమితం కాలేదు. చరణ్ వ్యాపారాల్లోను సూపర్ సక్సెస్ అయ్యాడు. స్మార్ట్ ఇన్వెస్టర్ గా చరణ్ కి ఇండస్ట్రీలో పేరు ఉంది. ఈ ముందు చూపుతోనే రామ్ చరణ్.. రెండు సంవత్సరాల క్రితమే వైజాగ్ లో భారీగా స్థలాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్నాడట. ఇందులో రామ్ చరణ్ అద్భుతమైన స్టూడియోకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న అన్నీ స్టూడియోలని మించి ఈ మెగా స్టూడియో నిర్మించబోతున్నారట. కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు.., సినిమాకి సంబంధించిన ఎలాంటి పని అయినా ఇక్కడే పూర్తి చేకునేలా రామ్ చరణ్ ఈ స్టూడియోని నిర్మించబోతున్నాడట. అంతా అనుకున్నట్టు జరిగితే.., వచ్చే ఏడాది మార్చ్ నాటికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాబోతుందని తెలుస్తోంది. మరి.., తెలుగు సినిమా అభివృద్ధి కోసం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న మెగా పవర్ స్టార్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుందాం.