మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా.. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. అన్నివిధాలా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ దాదాపు రూ. 250 కోట్ల వరకు కలెక్షన్స్ వసూల్ చేసింది. ఇప్పటికే రూ. 89 కోట్ల బ్రేక్ ఈవెన్ ని దాటుకొని.. సుమారు రూ. 40 కోట్లకు పైగా లాభాలు సాధించింది వాల్తేరు వీరయ్య. ఎప్పటినుండో మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న సాలిడ్ హిట్ వీరయ్య రూపంలో లభించింది.
ఇక సినిమా రిలీజ్ నుండే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ.. తాజాగా వరంగల్ లో వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. వీరయ్య టీమ్ తో రామ్ చరణ్, పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ గురించి చెబుతూనే, ఇండైరెక్ట్ గా కొందరికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాను మెగాస్టార్ తనయుడిగా కాకుండా వీరయ్య సినిమా చూసిన మెగాస్టార్ అభిమానిగా ఈ ఈవెంట్ కి వచ్చానని చెప్పాడు చరణ్. అలాగే చిరంజీవి గారికి తన తమ్ముళ్ల మీద ఎంత ప్రేమ ఉందో వీరయ్య సినిమాలో చూపించారు.
“సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది. ‘బాసు ఓసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి’ అనే డైలాగ్ తమ్ముడి క్యారెక్టర్ కాకుండా ఇంకా ఎవరైనా అని ఉంటే ఏమయ్యేది.. ఫ్యామిలీ, ఫ్యాన్స్ మాత్రమే ఆయన్ని ఏమైనా అనగలిగేది. మామూలుగా చిరంజీవి గారు సైలెంట్ గా ఉంటారు.. సౌమ్యులు అంటుంటారు. ఆయన క్వైట్ గా ఉంటేనే ఇన్ని వేలమంది వచ్చారు. అదే కొంచం బిగించి గట్టిగా మాట్లాడితే ఏమవుద్ధో బయటవాళ్ళకి తెలీదు. సో.. గుర్తుపెట్టుకోండి.. చిరంజీవి సైలెంట్ గా ఉంటారేమో కానీ.. ఆయన వెనకున్న మేం ఊరుకోము. క్వైట్ గా ఉండాలని క్వైట్ గానే చెబుతున్నాం” అంటూ చిరంజీవిపై కామెంట్స్ చేసేవాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు చరణ్. ప్రస్తుతం చరణ్ స్పీచ్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. మరి చరణ్ స్పీచ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.