హీరోలు లుంగీతో డ్యాన్స్ చేస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల మాస్ స్టెప్పులతో కేక పుట్టించారు. ఇంతకీ ఏంటి విషయం?
ఇద్దరు హీరోలు స్క్రీన్ పై కనిపిస్తేనే ప్రేక్షకులు అరిచి గోల చేస్తున్నారు. అలాంటిది ఏకంగా ముగ్గురు స్టార్స్ కనిపించడమే కాదు.. ఏకంగా కేక పుట్టించే స్టెప్పులతో మాస్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అవును అదే జరిగింది. ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. భాషతో సంబంధం లేకుండా యాక్టర్స్ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. అలా వెంకటేష్, సల్మాన్ కొత్త మూవీలో నటిస్తున్నారు. దీనిలోని ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో నార్త్, సౌత్ ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ పాటకు ఓ స్పెషాలిటీ కూడా ఉందండోయ్. మరి అదేంటో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’.. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించినప్పటికీ రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదు. ఈ విషయాన్ని అప్పుడే బయటపెట్టారు. దానికి కృతజ్ఞతగా రామ్ చరణ్.. తాజాగా సల్మాన్ సినిమాలో ఏకంగా స్టెప్పులేసి అలరించాడు. ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ పేరుతో తీస్తున్న ఈ సినిమాలోని ‘ఏంటమ్మా..’ అనే పాటని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో చరణ్-సల్మాన్-వెంకటేష్ స్టెప్పులు మాసీగా ఉన్నాయి.
ఇక ఈ పాటంతా కూడా ఏదో ఫ్యామిలీ సెలబ్రేషన్ సీన్ లో భాగంగా వచ్చేలా అనిపిస్తుంది. తొలి 2 నిమిషాలు సల్మాన్-వెంకీతోపాటు పూజాహెగ్డే, మిగతా యాక్టర్స్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. కాసేపటికి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. లుంగీ ఎత్తికట్టి మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటని హిందీ-తెలుగు పదాలతో క్రియేట్ చేయడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సాంగ్ మొత్తం ‘ఆచార్య’ సెట్ లోనే తీసినట్లు కనిపిస్తుంది. ఏప్రిల్ 21న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. సరే ఇదంతా పక్కనబెడితే చరణ్-సల్మాన్-వెంకీమామ కలిసి డ్యాన్స్ చేయడం మీకెలా అనిపించింది. కింద కామెంట్ చేయండి.