ఈ ఫొటోలో ఒకరేమో సాధారణ హీరో అయితే.. మరొకరేమో పాన్ ఇండియా స్టార్. మరి వీరిద్దరూ ఎవరో తెలుసుకోవాలంటే కింద చదివేయాల్సిందే.
సాధారణంగా చిన్నప్పటి హీరోల ఫోటో చూస్తే కాస్త గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు ఇంతలా ఫాలోయింగ్ సంపాదించుకున్న వారు అప్పట్లో భలే ఉన్నారే అని ఆశ్చర్యపడాల్సిందే. తాజాగా అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు కనిపించింది. చూస్తుంటే వీరిద్దరిలో ఒకరిని గుర్తుపట్టేయడం కొంచెం ఈజీగా ఉన్నా.. మరొకరిని మాత్రం అస్సలు గుర్తుపట్టలేరు. వీరిద్దరూ ప్రస్తుతం సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవారు. ఒకరేమో టాప్ హీరోల్లో ఒకరైతే.. మరొకరు అడపాదడపా సినిమాలతో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకే ఫ్యామిలీకి చెందినవారైనా ఇద్దరు కూడా ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగ ఉంటారు.
2007 లో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తే.. మరొకరేమో 2010 లో మొదటి సినిమా స్టార్ట్ చేసినా 2014 లో మొదటి విజయం దక్కింది. వీరిద్దరూ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వారు కావడం విశేషం. ఇప్పటికే వీరెవరో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. కుడివైపు నవ్వుతూ నించుంది సాయి ధరమ్ తేజ్ అయితే.. ఎడమ వైపు భుజంపై చేతులు వేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం వీరిద్దరూ కూడా హీరోలుగా సెటిల్ అయ్యారు. ఇక వీరిద్దరి కెరీర్ గురించి పెద్దగా చెప్పాల్సి వస్తే రామ్ చరణ్.. మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా 2007 లో చిరుత ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయినా ఆ తర్వాత వచ్చిన మగధీర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
దీంతో ఒక్కసారిగా టాప్ హీరోల లిస్టులోకి చేరిపోయాడు రామ్ చరణ్. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసబెట్టి కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తన మార్కెట్ ని విస్తరించుకున్నాడు. రంగస్థలం సినిమాతో తన నటనతో విశ్వరూపమే చూపించాడు. ట్రిపుల్ ఆర్ సినిమాతో చరణ్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఇక సాయి ధరమ్ తేజ్ 2010 లో రేయ్ సినిమా ద్వారా సినిమా ఎంట్రీ ఇచ్చాడు. 2014 లో వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ద్వారా తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూ.. అప్పుడప్పుడు హిట్ కొడుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుండగా.. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ఇటీవలే రిలీజై థియేటర్లలో సందడి చేస్తుంది.