తెలుగు ఇండస్ట్రీలో ఎంతగానో ఎదురు చూసిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు వసూలు చేసింది. వారం రోజులు ముగిసేసరికి రూ.710 కోట్ల వసూళ్లుతో పలు రికార్డులు తిరగరాసింది. కాగా, ఈ చిత్రంలో రామ్ చరణ్ నటన ఎంతో అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఉత్తరాదిన కూడా ఈ మూవీ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంలో ఉన్నారు. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన బంగారు మనసు చాటుకున్నాడు. ఈ సినిమా కోసం పనిచేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ప్రత్యేక ఆహ్వానం పంపించి వారిని సత్కరించారు. దాదాపు అన్ని విభాగాల్లో పనిచేసిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు.
సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. వారందరికీ ఒక స్వీట్ బాక్స్ తో పాటు తులం బంగారం కాయిన్ కానుకగా అందజేశారు.