మెగాహీరో రామ్ చరణ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ టైటిల్ వీడియో చూసిన ఫ్యాన్స్.. అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ రీసెంట్ గానే ఆస్కార్ గెలుచుకుంది. తెలుగు సినిమా రేంజ్ ని పెంచేసింది. ఈ మూవీలో హీరోలుగా నటించిన చరణ్, తారక్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే దీని తర్వాత చరణ్ ఎలాంటి సినిమా చేస్తున్నాడా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు RC15 టీమ్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. మెగాపవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టైటిల్ వీడియోని అధికారికంగా రిలీజ్ చేసింది. ఇది చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలైపోవడం గ్యారంటీ అని ఫిక్సయిపోతున్నారు. అదే టైంలో వీడియోని బట్టి స్టోరీని కూడా ఓ అంచనా వేసేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నారు. గతేడాదిలోనూ షూటింగ్ ప్రారంభమైంది. అయితే కమల్ తోనూ శంకర్ మూవీ చేస్తుండటం వల్ల ఇది లేటవుతూ వచ్చింది. ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. 42 సెకన్ల వీడియోని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇదే పెట్టడం వెనక ఓ కారణం కూడా ఉంది. RRR టైటిల్ సింపుల్ ఇంగ్లీష్ లెటర్స్ తో ఉండటం వల్ల అన్ని భాషల వాళ్లకు ఈజీగా అర్థమైపోయింది. అందుకే రామ్ చరణ్-శంకర్ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ వీడియోని బట్టి చూస్తుంటే.. పూర్తిస్థాయి ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. పాలిటిక్స్ ని మొత్తం మార్చేసే ‘గేమ్ ఛేంజర్’గా చరణ్ కనిపించబోతున్నాడు. దీన్నిబట్టి పాన్ ఇండియా లెవల్లో కాదు ఏకంగా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మెగాపవర్ స్టార్ రెడీ అయిపోతున్నట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్. తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇందులో చరణ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. మరి చరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ చూడగానే మీకేం అనిపించింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.