మెగాహీరో రామ్ చరణ్ ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నాడు. అదే టైంలో తెగ టెన్షన్ కూడా పడిపోతున్నాడు. ఇంతకీ చరణ్ అన్ని రకాల ఎమోషన్స్ కు కారణమేంటి? తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవేయాల్సిందే.
టాలీవుడ్, చరిత్రలో నిలిచిపోయేందుకు కేవలం ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది. అసలు ఓ తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళ్తుందని కనీసం ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రాజమౌళి చూపించాడు. ‘ఆర్ఆర్ఆర్’ అనే అద్భుతమైన చిత్రంతో వెస్ట్రన్ ఆడియెన్స్ మనసులు గెలుచుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లిపోయాడు. దీంతో పలు విభాగాల్లో పోటీపడినప్పటికీ.. ఫైనల్ గా ‘నాటు నాటు’ సాంగ్ నామినేషన్స్ లో నిలిచింది. మార్చి 12న అవార్డు వస్తుందా తేలిపోనుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఆ వేడుక కోసం అక్కడికి వెళ్లిన రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సినిమా గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆస్కార్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఈ అవార్డు కోసం ఫర్ ది ఫస్ట్ టైమ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పాట నామినేట్ అయింది. ఇక కీరవాణితోపాటు ఒరిజినల్ గా పాడిన కాలభైరవ-రాహుల్ సిప్లిగంజ్ కూడా లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. తాజాగా అలా ‘ఎంటర్ టైన్ మెంట్ టునైట్’ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్ చరణ్, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆర్ఆర్ఆర్ విషయంలో అనుకున్న దానికంటే ఎక్కువ ప్రేమ, అభినందనలు దక్కాయని రివీల్ చేశాడు.
‘మంచి మూవీకి భాషతో సంబంధం లేదనడానికి RRR ఓ ఉదాహరణ. ఇప్పుడు సినిమా గ్లోబల్ అయిపోయింది. ఇలాంటి సినీ గ్లోబలైజేషన్ సమయంలో తాను సినీ ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే టైంలో హాలీవుడ్ లో చాలామంది డైరైక్టర్స్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. జేజే అబ్రమ్స్, క్వాంటిన్ టొరంటినో నా ఫేవరెట్ డైరెక్టర్స్. వారిద్దరూ తమతో పనిచేసే యాక్టర్స్ కు సవాలు విసురుతూ ఉంటారు. ఇకపోతే ఆస్కార్ వేడుకలో పాల్గొనే ఛాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. మరోవైపు చాలా టెన్షన్ గానూ ఉంది. ఎందుకంటే నేను అభిమానించే యాక్టర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. మరి నేను అక్కడ ఫ్యాన్ గా ఉంటారా, యాక్టర్ గా ఉంటానా అనేది చూడాలి. ఆస్కార్ కు కీరవాణి అర్హులు. ఆయనని సపోర్ట్ చేయడానికే మేమంతా ఇక్కడికి వచ్చాం’ అని చరణ్ చెప్పుకొచ్చారు.
Gearing up for Sunday 🌟.
Had a gud chat with @AshCrossan at @etnow pic.twitter.com/uCruMDcyzQ— Ram Charan (@AlwaysRamCharan) March 10, 2023