జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. నడిచి వచ్చిన దారిని మాత్రం మరవకూడదు. మరీ ముఖ్యంగా మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ముఖ్య కారకులు.. గురువులు. అలాంటి టీచర్లకు మనం జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి. మన ఉన్నతిని చూసి అందరి కంటే ఎక్కువ సంతోషించేది తల్లిదండ్రులు, గురువులు. వారిని గుర్తుపెట్టుకుని వెళ్లి పలకరించడం సంస్కారం. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు మెగా హీరో రామ్ చరణ్. ఆయన ఎంత మంచి వాడో.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటాడని అందరికి తెలుసు. తన దగ్గర పని చేసేవారిని కూడా చాలా ఆదరంగా చూస్తాడు రామ్ చరణ్. ఆయన చేసే పనులు చూస్తే.. సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అనిపిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ప్రస్తుతం రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న చిత్రం RC 15లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. శంకర్ సినిమాలు అంటే ఎంత భారీగా, రిచ్‌గా ఉంటాయో అందరికి తెలిసిందే. ఆర్‌సీ 15ని కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తునఆనరు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరిగింది. అయితే ఈ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు చదువు చెప్పిన టీచర్ ఒకరు.. రాజమండ్రిలోనే ఉంటున్నారని తెలుసుకున్న చరణ్.. ఆమె అడ్రస్ తెలుసుకుని.. స్వయంగా టీచర్ ఇంటికి వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
మనకు చదువు చెప్పిన టీచర్లను అందరం గుర్తుంచుకుంటాం. వీలున్నప్పుడు వెళ్లి పలకరిస్తాం. కానీ స్టార్ హీరో అయిన రామ్ చరణ్‌లాంటి స్టార్ హీరో.. షూటింగ్ కోసం వచ్చి.. తన టీచర్ గురించి తెలుసుకుని.. స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి కలవడం అనేది అరుదైన విషయమే. దాంతో చెర్రి చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా చెర్రి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న RC 15 సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని సమాచారం.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పోషిస్తున్న రెండు పాత్రల్లో ఒకటి ముఖ్యమంత్రి రోల్ అని సమాచారం. ఇక రెండో పాత్ర ఎన్నికలను నిర్వహించే ఐఏఎస్ పాత్ర అని తెలుస్తోంది. చరణ్‌ని చూస్తే.. ఈ సినిమాలో ఆయన రెండో పాత్రకు సంబంధించిన లుక్ ఎలా ఉంటుందనేది అర్థం అవుతోంది. అయితే ముఖ్యమంత్రి గెటప్‌లో చరణ్ ఎలా ఉండబోతుందో చూడాలి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోది. ఇక ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.