మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కేంద్రమంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు. పక్కనే ఉన్న చిరు పుత్రోత్సాహంతో తెగ మురిసిపోయారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ ఎందుకోసం కలిశారో తెలుసా?
సినిమా నటులు మహా అయితే ఏం చేయగలరు.. నటిస్తారు, అభిమానుల్ని సంపాదించుకుంటారు అంతే కదా అని అనుకోవచ్చు. వాళ్లు తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగలరు. ఎవరికీ సాధ్యం కానివి అసాధ్యం చేయగలరు. అలా ఎన్నో దశాబ్దాల నుంచి మనకు కలగానే ఉన్న ఆస్కార్ ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సంపాదించి పెట్టింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుంది. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ల క్రేజ్ అస్సలు మాములుగా లేదు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ కొట్టి, స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత రామ్ చరణ్ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా కలిశారు. చరణ్ ని సన్మానించారు కూడా. పక్కనే ఉన్న చిరంజీవి, కొడుకు ఎదుగుదల చూసి తెగ మురిసిపోయారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసి మరీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే టైంలో ఈ భేటీ గురించి ట్వీట్ చేసిన అమిత్ షా.. ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ ని కలవడం ఎంతో ఆనందంగా ఉందని రాసుకొచ్చారు.
‘భారతీయ కల్చర్, ఎకానమీని తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రభావితం చేస్తోంది. ఎదుగుదలకు కారణమవుతోంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో పాటు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా రామ్ చరణ్ ని అభినందిస్తున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన చరణ్.. ‘మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాను. ఆర్ఆర్ఆర్ టీమ్ కృషిని మెచ్చుకున్నందుకు థ్యాంక్యూ సర్’ అని రీట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇండియా టుడే కాంక్లేవ్ కోసం దిల్లీ వెళ్లిన చరణ్.. అక్కడే అమిత్ షాను కలిశాడు. మరి చిరు-చరణ్ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Truly an honour to meet our Honourable Home Minister @AmitShah Ji at the @IndiaToday Conclave.
Thank you sir for appreciating the efforts of @RRRMovie team 🙏@KChiruTweets https://t.co/YvjdOLzqUk— Ram Charan (@AlwaysRamCharan) March 17, 2023