బాలీవుడ్ లో మరో బ్యూటీఫుల్ జోడీ పెళ్లికి రెడీ. కొన్నిగంటల్లో కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా జంట.. ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనుంది. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూరజ్ గడ్ ప్యాలెస్ ఈ వేడుకకు వేదిక. గత రెండు రోజుల నుంచి పెళ్లి హడావుడి సాగుతోంది. ఇరుకుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు, సినీ సెలబ్రిటీలు.. ఇలా చాలామంది అతిథులు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. ఇక గత రెండో రోజుల నుంచి అంతా కూడా ధూమ్ ధామ్ గా జరుగుతోంది. అయితే ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కియారా అడ్వాణీ, తెలుగులోనూ ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇక హిందీలో కబీర్ సింగ్, షేర్షా లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ కాంబోలో తీస్తున్న పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేస్తుంది. తెలుగులో కొన్నే సినిమాలు చేసినప్పటికీ.. హీరోలతో ఈమె మంచిగా బాండింగ్ పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మంగళవారం రాత్రి జరిగే కియారా పెళ్లి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తోపాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు వెళ్లనున్నట్లు సమాచారం. ఈవెంట్ లో వీళ్లకు సంబంధించిన ఫొటోలు ఏవైనా బయటకొస్తే గానీ అసలు విషయం తెలియదు.
సరే ఈ గెస్టుల గోల అంతా పక్కనబెడితే.. కియారా-సిద్ధార్థ్ పెళ్లికి దాదాపు రూ.2 కోట్లపైనే ఖర్చు చేస్తున్నారట. ఈ మ్యారేజ్ ప్లానింగ్ అంతా కూడా ముంబయికి చెందిన ఓ సంస్థ దగ్గరుండి చూసుకుంటోందట. పెళ్లికి వస్తున్న గెస్టులను రిసీవ్ చేసుకునేందుకు ఏకంగా 80 లగ్జరీ కార్లని రెడీగా ఉంచారట. బాలీవుడ్ లో జరుగుతున్న ఖరీదైన పెళ్లిళ్లలో ఇది కచ్చితంగా ఒకటిగా నిలవనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. చెప్పాలంటే ఫిబ్రవరి 6నే కియారా-సిద్ పెళ్లి జరగాల్సింది. కానీ ఏమైందో గానీ ఒకరోజు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 7న ఈ తంతు జరగనుంది. ఇక కొన్నిరోజుల తర్వాత ముంబయిలో భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ప్లాన్ చేశారట. మరి హీరోయిన్ కియారా పెళ్లి టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలకు ఆహ్వానం అందడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
#RC15 – A song shoot postponed to February 9th as team will be attending #KiaraSidharthwedding#RamCharan #Shankar #KiaraAdvani #Thaman #Anjali #Srikanth #kiarawedding https://t.co/tYNSbRt7in pic.twitter.com/fcTZqlb86O
— TeluguOne (@Theteluguone) February 6, 2023