తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ప్రభంజనం సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకొని కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ సక్సెస్ సందర్భంగా ముంబాయికి వెళ్లిన రామ్ చరణ్ అక్కడ కొంత మంది ఫ్యాన్స్ ని కలిశారు. అలాగే ఒక థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ తో కలిసి చూశారు.
బాంద్రాలోని మిజూ రెస్టారెంట్ లో భోజనం చేసిన ఆయన బయటకు వచ్చే సమయంలో ఒక యాచకురాలు చిన్న పాపతో రామ్ చరణ్ వద్దకు వచ్చింది. ఆమెను చూసిన రామ్ చరణ్ వెంటనే చిరునవ్వుతో డబ్బులు అందించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చరణ్ మంచి మనసు గురించి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Gold .@AlwaysRamCharan 🙏❤️
Giving money to Her.❤️ pic.twitter.com/ZJhHnmM9Jt
— ℂհᎥttᎥ (@AlwaysMeghamala) April 5, 2022