‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌తో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఆయన హాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ రాలేదు. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. అసలు చెర్రీ ఏమన్నారంటే..!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ వరల్డ్ ఇమేజ్ సంపాదించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆయన నటనకు భారతీయ ప్రేక్షకులతో పాటు ఫారిన్ ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. చెర్రీ హాలీవుడ్లో నటించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా రామ్ చరణ్ లాంటి పెర్ఫార్మర్ ఇంగ్లీష్ మూవీస్‌లో నటిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చరణ్ హాలీవుడ్లో ఎప్పుడు నటిస్తాడు, ఏ మూవీలో నటిస్తాడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఆస్కార్ వేడుకల కోసం అమెరికాకు వెళ్లింది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ టీమ్.
రామ్ చరణ్ కూడా యూఎస్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి చెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో భారత దేశానికి ఆవల ఏదైనా మూవీస్‌లో నటించాలని ఉందా? అమెరికన్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసేందుకు మీరు రెడీగా ఉన్నారా అని చెర్రీని యాంకర్ ప్రశ్నించారు. దీనికి చెర్రీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సినిమాలకు ప్రోత్సాహం ఉన్న ప్రతి దేశంలో తనకు నటించాలని ఉందని తెలిపారు. పలు హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయని చరణ్ చెప్పారు.
‘సినిమాలకు ఆదరణ, నటనను మెచ్చుకోలు దొరికిన ప్రతిచోట నాకు నటించాలని ఉంది. ప్రతిభకు ఆస్కారం ఉన్న పాత్రలు లభిస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా. హాలీవుడ్‌లోనూ నాకు నటించాలనే ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మనం ప్లాన్ చేయగలం, కోరుకోగలం. కానీ సమయం వచ్చినప్పుడు దానంతట అదే జరగాలి. ఇప్పటికే ఆ వైపుగా చర్చలు సాగుతున్నాయి. అయితే అది ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందనేది కచ్చితంగా చెప్పలేను’ అని చరణ్ పేర్కొన్నారు. తన హాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్టుకు సంబంధించి మరికొన్ని నెలల్లో న్యూస్ రావొచ్చు అని వివరించారు. మరి.. రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కోసం మీరు ఎంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“Talks are Happening With Hollywood Studios & You Can Expect Some News about a Hollywood Project in Couple of Months”@AlwaysRamCharan Reveals About his Hollywood Collaboration in Talks on @TalkEasyPod 🔥🔥
BIGG EXPLOSION ON CARDS 💥💥💥💥💥💥💥 pic.twitter.com/nByzOfMrFh
— Trends RamCharan (@TweetRamCharan) March 8, 2023