సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది. ఈ మద్యనే ప్రముఖ దర్శకుడు సుకుమార్‌పై ఓ అభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. రెండున్నర ఎకరాల భూమిలో వరి పంటతో సుకుమార్ రూపం వచ్చేలా పంటను సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ చూసి సుకుమార్ కళ్లు చెమ్మగిల్లాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఒక అభిమాని వినూత్నంగా తన అభిమానం చాటుకున్నాడు. జయరాజ్ ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.. తర్వాత ఆయన తనయుడు రామ్ చరణ్ కి అభిమానిగా మారాడు. ఈనెల 27న రామ్ చరణ్ పుట్టినరోజుకు ఓ అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావించాడు జయరాజ్. ఈ క్రమంలో అర ఎకరానికి పైగా స్థలంలో రామ్ చరణ్ చిత్రం వచ్చేలా వరినాట్లు వేసాడు. ఈ విషయం తెలుసుకున్న చిరు అభిమాన సంఘ అధ్యక్షులు స్వామి తనతో పాటు కొంతమందితో ఆ గ్రామాన్నిసందర్శించి జయరాజు వేసిన చిత్రాన్ని ఆనందంతో పొంగిపోయారు.
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ శిల్పారామంలో జరగనున్న సందర్భంగా జయరాజ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. గతంలో జయరాజ్ రామ్ చరణ్ ఇంటికి కాలి నడకన వెళ్లి కలిశారు.. అంతేకాదు జయరాజ్ పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు. ఇండస్ట్రీలో మంచి అవకాశం వస్తే తప్పకుండా సహాయం చేస్తానని రామ్ చరణ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.