మెగాఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలను ఆర్ఆర్ఆర్ సినిమా బీట్ చేసేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. పాన్ ఇండియా పీరియాడిక్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో బ్రిటిష్ ప్రభుత్వం వద్ద పోలీస్ అధికారి రామరాజుగా రాంచరణ్, గోండు వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అయితే.. ఈ సినిమాలో చరణ్, తారక్ లను చూపించిన తీరుకు సినీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మొదటి రోజు నుండే అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డులు బద్దలు కొడుతోంది ట్రిపుల్ ఆర్. ఫస్ట్ డే 223 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. అగ్ని పర్వతం బద్దలైనట్లుగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. రామరాజు పాత్రకు కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు రామ్ చరణ్ నటనను చూసి విమర్శించినవారే ఇప్పుడు అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.
అదంతా రాజమౌళి క్రెడిట్ అయినప్పటికీ.. చరణ్ కి, మెగా అభిమానులకు ఈ సినిమా చాలా స్పెషల్ గా నిలుస్తుంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. ఈ క్రమంలో చరణ్ బర్త్ డే గిఫ్ట్ గా అభిమానులు ట్రిపుల్ ఆర్ ని బ్లాక్ బస్టర్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే రామ్ చరణ్ తాజాగా ట్రిపుల్ ఆర్ సక్సెస్ పై అన్ని భాషల్లో ఓ నోట్ రిలీజ్ చేశాడు. ‘రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన అందరికీ నా కృతజ్ఞతలు.. ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి రామ్ చరణ్ నటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Thank You 🙏🙏 pic.twitter.com/8rh5w3TUkR
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2022