మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వతా మెగాస్టార్ తో కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా విడుదల సిద్ధంగా ఉంది. అయితే రామ్ చరణ్ గురించి మరో క్రేజీ వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ 15వ చిత్రం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో చరణ్ తో బీటౌన్ బ్యూటీ కియారా మరోసారి జోడీ కట్టనుంది. అయితే ఆ చిత్రం టైటిల్ ఫిక్స్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
రామ్ చరణ్ 15వ చిత్రానికి ‘సర్కారోడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాలీవుడ్ టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయమై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే.. ప్రభుత్వంలో ఉండే లోపాలను ఎండగట్టే పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నుంచి రానున్న మరో పాన్ ఇండియా సినిమా ఇది. చెర్రీ కెరీర్ లో ఇది 15వ చిత్రం కావడం మాత్రమే కాదు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నుంచి రానున్న 50వ చిత్రం కూడా కావడం మరో విశేషం.
ఇదీ చదవండి: టాప్ పొజిషన్ కి రావాలంటే వారితో బెడ్ షేర్! రష్మీ పోస్ట్ వైరల్
అంతేకాదు.. ఈ సినిమాలో బాబాయ్ పవన్ మార్క్ కూడా ఉండనున్నట్లు సమాచారం. జానీ సినిమాలో పవన్- రేణూదేశాయ్ నటించిన ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది’ క్లాసిక్ హిట్ సాంగ్ ను రామ్ చరణ్ రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు అభిమానులకు మరింత కిక్ ఇస్తున్నాయి. చెర్రీ మెగాస్టార్ పాటలను రీమేక్ చేయడం చూశాం. మరి, బాబాయి పాటకు చరణ్ ఏం రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. ‘సర్కారోడు’ యాప్ట్ టైటిల్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సర్కారోడు టైటిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Sarkarodu Under The Consideration Of #RC15 Title..🔥
Official Announcement On 27th March..🔥💥💥#RamCharan @AlwaysRamCharan pic.twitter.com/ndt8ohoOaK— ʀᴀᴍᴄʜᴀʀᴀɴ ᴛʀᴇɴᴅꜱ🔥 (@RCTRENDS_27) March 9, 2022