సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు వారి జాతకాలను విశ్లేషించి సంచలనంగా మారిన వేణు స్వామి అందరికి పరిచయమే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూతరి జాతకాన్ని గురించి తెలియజేశారు. ఆ వివరాలు మీకోసం..
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం రోజున మా ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ మెగా కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే మెగా లిటిల్ ప్రిన్సెస్ కు వెల్ కమ్ చెప్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి రామ్ చరణ్ కూతురు కు సంబంధించిన జాతకాన్ని గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆ పాప భవిష్యత్ ఇంకా తదితర విషయాల గురించి వివరించారు.
రాజకీయ ప్రముఖుల నుంచి మొదలుపెడితే సినీ ప్రముఖుల వరకు వారి జాతకాలను వివరిస్తూ సంచలనంగా మారిన జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటీనటుల భవిష్యత్ ఎలా ఉంటుంది.. వారికి సినిమా అవకాశాలు ఎలా ఉంటాయి.. అంటూ పలు విషయాలు వెళ్లడిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు, రామ్ చరణ్ కూతురు జాతకాన్ని వివరించారు. ఆ చిన్నారి భవిష్యత్తులో గొప్పస్థాయికి వెళ్తుందని, కొణిదెల వంశానికి కీర్తప్రతిష్టలు తెచ్చిపెడుతుందని వివరించారు.
వేణు స్వామి మాటల్లో ‘రామ్ చరణ్ కూతురు పుట్టింది పునర్వసు నక్షత్రము, రెందవపాదము, మిధున రాశి. జన్మనామము కోణంగి అని తెలిపారు. ఇక పాప తల్లిదండ్రులైన రామ్ చరణ్ ది రోహిణి నక్షత్రం, ఉపాసనది కృత్తిక నక్షత్రం, వారి పాపది పునర్వసు నక్షత్రం అని తెలిపారు. ముగ్గురు కూడా దైవిక అంశ కలిగిన నక్షత్రాల్లో జన్మించారని తెలిపారు. ఆ పాప జన్మించిన సమయం అధ్భుతంగా ఉందని, జాతకంలో విపరీతమైన రాజయోగం ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గొప్ప స్థాయిలో కీర్తి గడిస్తుందని చెప్పారు. కొణిదెల వంశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తుందని వెల్లడించారు. తాతకు తండ్రికి అన్ని రంగాల్లో కలిసి వస్తుందని చెప్పారు. తాతను, తండ్రిని మించి గొప్ప స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. వేణు స్వామి రామ్ చరణ్ కూతురి జాతక విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.