'వీడు హీరో ఏంట్రా?' అని రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ లో చాలామంది విమర్శించారు. కానీ వాటికి చెక్ పెడుతూ ఎవరూ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్కో సినిమా కోసం చాలా కష్టపడి ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. మెగాఫ్యామిలీకే మహారాజులా మారిపోయాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు గ్లోబల్ వైడ్ సెన్సేషనల్ గా మారిన టాలీవుడ్ స్టార్. మొన్నటివరకు అందరూ మెగాస్టార్ చిరంజీవి కొడుకు అని ఇతడిని పిలిచారు. ఇప్పుడు వాళ్లే.. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటున్నారు. ఇలా పేరు తెచ్చుకోవడం వెనక ఎన్నో ఏళ్ల కష్టముంది. ఎన్నో విమర్శలకు సమాధానమూ ఉంది. ఒక్కో సినిమాతో యాక్టింగ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ, అదే టైంలో అభిమానుల్ని మెప్పిస్తూ చరణ్ వచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని.. గ్లోబల్ స్టార్ అయిపోయాడు. తాజాగా పుట్టినరోజు జరుపుకొంటున్న చరణ్ కు విషెస్ చెబుతూ.. అతడి కెరీర్ గురించి, గ్లోబల్ స్టార్ వరకు తన రేంజ్ పెరగడం గురించి ఓసారి మాట్లాడుకుందాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి వేసిన బాటలో ఆయన ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది హీరోలు వచ్చారు. అందరూ కూడా తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్ మాత్రం అంతకు మించిన ఫేమ్ సంపాదించాడు. ‘చిరుత’ హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ స్టార్టింగ్ లో కమర్షియల్ సినిమాలు చేశాడు. హిట్స్ కొట్టినప్పటికీ లుక్స్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ‘రంగస్థలం’తో తనలో కొత్త నటుడ్ని బయటకు తీసిన చరణ్.. హిట్ కొట్టి, కోట్లకు కోట్లు కలెక్షన్స్ సాధించి విమర్శకుల నోళ్లు మూతపడేలా చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’తో వేల కోట్ల వసూళ్లు పోగేసుకుని, పాన్ ఇండియా వైడ్ కాదు ఏకంగా వరల్డ్ వైడ్ సెన్సేషన్ గా మారిపోయాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుని, మొత్తం మెగా ఫ్యామిలీకే మహారాజులా మారిపోయాడు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తన కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నాడు. తాజాగా పుట్టినరోజు సందర్భంగా వీడియోని రిలీజ్ చేశారు. దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడు. ఇది తన కెరీర్ లోనే మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్ అని చరణ్ స్వయంగా చెప్పాడు. రీసెంట్ గా హాలీవుడ్ నిర్మాణ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని చరణ్ చెప్పుకొచ్చాడు. ఇదంతా చూస్తుంటే.. చరణ్ విమర్శలు దాటి విశ్వ నటుడిగా ఎదిగిన తీరు గుర్తొస్తుంది. ఇది కదా సక్సెస్ అంటే, గ్లోబల్ స్టార్ ఊరికే అయిపోరు.. చాలా కష్టపడితేనే అవుతారని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. రామ్ చరణ్ అంటే ఓ సాధారణ నటుడు కాదు.. తెలుగు హీరోలకు ఓ స్పూర్తి అని మాట్లాడుకుంటున్నారు. యావత్ దేశం గర్వపడే స్థాయికి చేరుకున్న రామ్ చరణ్.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుమన్ టీవీ కోరుకుంటోంది. ఇంకెందుకు లేటు.. కింద కామెంట్ లో మీరు కూడా రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ చెప్పేయండి.
the man of masses, the ultimate mega power star, thank you for existing Ram Charan 👑 pic.twitter.com/k0ExXLnJfs
— prime video IN (@PrimeVideoIN) March 27, 2023