మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేడు. అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు. కెరీర్‌పరంగా, వ్యక్తిగతంగా కూడా ఈ ఏడాది రామ్ చరణ్‌కు బాగా కలిసి వచ్చింది. రామ్ చరణ్ జీవితంలో 2023 ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ ఏడాది ఆయన తండ్రి కావడం ఒక శుభవార్త అయితే.. సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే.. ఆస్కార్ అవార్డును అందుకోవడం మరో చారిత్రక అంశం. రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ఈ ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగీరిలో ఆస్కార్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఉపాసన అన్నట్లు.. భవిష్యత్తు అంతా చెర్రీదే. రామ్ చరణ్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే.. ఈ మాట అక్షర సత్యం అనిపించకమానదు. చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఆస్కార్ స్థాయికి చేరుకున్నారు. కుమారుడు సాధించిన విజయాలు చూసి.. చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగి పొతున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం సాధించడమే కాక.. ఏకంగా ఆస్కార్ గెలవడంతో.. సంబరాల్లో మునిగి తేలుతున్నారు రామ్ చరణ్. ఈ సంతోష సమయంలోనే చెర్రి పుట్టిన రోజు రావడంతో.. సంబరాలు అంబరాన్ని తాకాయి. అభిమానులు పెద్ద ఎత్తున మెగా పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారు. ఇక బర్త్‌డే సందర్భంగా కుమారుడిపై తన ప్రేమను చాటుకుంటూ.. విషెస్ తెలిపారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరలవుతోంది. రామ్ చరణ్‌ని ప్రేమగా దగ్గరకు తీసుకుని.. ముద్దు పెడుతున్న ఫొటో షేర్ చేసిన చిరంజీవి.. హ్యాపీ బర్త్‌డే నాన్న.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.. అంటూ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. చేసింది 15 సినిమాలే అయినా.. ఆస్కార్ గెలిచి.. తండ్రి సాధించలేనిది.. కుమారుడిగా.. అతి తక్కువ కాలంలో సాధించి చూపాడు. మగధీర, రంగస్థలం, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలు చరణ్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోతాయి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు రామ్ చరణ్. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా నేడు RC15 చిత్రానికి ‘గేమ్ చేంజర్’ టైటిల్ ఫిక్స్ చేశారు. మొత్తానికి మోషన్ పోస్టర్ వీడియో ద్వారా టైటిల్ రివీల్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం.. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తారు.
Proud of you Nanna.. @AlwaysRamCharan
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
పవన్ కళ్యాణ్ కూడా రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్‌కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తను జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలి.. మన్ననలు పొందాలి అని కోరుకుంటూ బర్త్‌డే విషెస్ తెలిపాడు పవన్ కళ్యాణ్.
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి… మన్ననలు పొందాలి – పవన్ కళ్యాణ్ #PawanKalyan #HBDGlobalStarRamCharan pic.twitter.com/EIysbxNHO5
— BA Raju’s Team (@baraju_SuperHit) March 27, 2023