రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రపంచవ్యాప్తంగా చెర్రీకి అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ అమెరికాలో సూట్ వేసుకుని ఎంతో స్టైలిష్ గా కనిపించడంపై నెట్టింట ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా వెండితెరకు పరిచయమై.. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునే స్థాయికి మెగా పవర్ స్టార్ ఎదిగాడు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని మెగాస్టార్ కూడా పలు సందర్భాల్లో పస్తావించారు. ట్రిపులార్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. రాజమౌళి క్రియేషన్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న మొట్ట మొదటి భారతీయుడు రామ్ చరణ్ కావడం విశేషం. అయితే అమెరికాలో ప్రస్తుతం రామ్ చరణ్ లుక్స్ పై నెట్టింట పలు అనుమానాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ న్యూయార్క్ లో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్నాడు. టైమ్స్ స్క్వేర్ వద్ద రామ్ చరణ్ కోసం పెద్దఎత్తున అభిమానులు ఎదురుచూడటం, అభిమానులతో కలిసి చెర్రీ సెల్ఫీలు దిగడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ ఎంతో స్టైలిష్ లుక్స్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు ఆ ఫొటోలపై కొందరు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అమెరికా వెళ్లేటప్పుడు కూడా రామ్ చరణ్ స్వామిమాలలో ఉన్నాడు కదా? మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందుకు సూట్ లో వచ్చాడు, పైగా పాదరక్షలు ధరించాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Mr. C in sharp, dapper mode as always 😎🔥
‘MEGA POWERSTAR’ @AlwaysRamCharan debuts on the famous talk show @GMA and joins the elite list of celebrities ✨️#RamCharan #ManOfMassesRamCharan #GoodMorningAmerica #RRR #Oscars2023#NaatuNaatuForOscars pic.twitter.com/SCAfYxm62Q
— SivaCherry (@sivacherry9) February 23, 2023
కార్యక్రమం కోసం రామ్ చరణ్ అలా డ్రెస్ మార్చుకున్నట్లు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజానికి రామ్ చరణ్ తీసుకున్న 21 రోజుల దీక్ష ముగియడంతో న్యూయార్క్ లోని ఆలయంలో దీక్షను విరమించినట్లు పీఆర్ టీమ్ వెల్లడించింది. అందుకే రామ్ చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో స్టైలిష్ లుక్స్ లో, కాళ్లకు బూట్లు వేసుకుని కనిపించాడు. ఇంక కార్యక్రమంలో విషయానిక వస్తే.. ట్రిపులార్ సినిమా సక్సెస్, రాజమౌళి నైపుణ్యం, ఆస్కార్ బరిలో నిలవడం, గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం, త్వరలోనే తండ్రికాబోతున్న సందర్భంగా భయ పడుతున్నారా? అంటూ పలు ఆసక్తికర ప్రశ్నలకు రామ్ చరణ్ నుంచి హోస్ట్స్ సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. ఇంక మార్చి 3 నుంచి అమెరికాలో ట్రిపులార్ సినిమా మరోసారి ప్రదర్శించనున్నారు.
“RRR” star Ram Charan (@AlwaysRamCharan) dishes on “Naatu, Naatu” becoming the first song from an Indian film production to be Oscar-nominated for best original song. #GMA3 pic.twitter.com/tpfIPFqcDu
— GMA3: What You Need To Know (@ABCGMA3) February 22, 2023