అభిమాన సినీతారలు ఏం చేసినా అభిమానులకు కనువిందుగానే ఉంటుంది. ముఖ్యంగా సినిమా షూటింగ్స్ లేనప్పుడు లేదా ఏవైనా పండగ సమయాలలో స్టార్ హీరోలు, హీరోయిన్లు డైలీ రొటీన్స్ పెట్టే సోషల్ మీడియా పోస్టులను ఇట్టే వైరల్ చేసేస్తుంటారు ఫ్యాన్స్. కొన్నిసార్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించిన పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవలే రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లు వసూల్ చేసి ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ శివాలయంలో సేవచేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
గతంలో శివరాత్రి పండుగ సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక భావనతో శివలింగానికి పూజలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కాకతీయుల కాలంలో 800 ఏళ్ల క్రితం నిర్మించిన దోమకొండ కోటలోని శివాలయంలో చరణ్.. మహాశివుడికి పూజలు చేశాడు. సంప్రదాయ వస్త్రధారణలో శివాలయానికి వెళ్లిన చరణ్.. తన స్వహస్తాలతో శివలింగాన్ని కడిగి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. చరణ్ శివాలయంలో సేవ చేసిన వీడియోను అప్పట్లో ఉపాసన పోస్ట్ చేశారు.
The #Domakonda Fort Shivalayam is over 800 years old from the Kakatiya Period.
Our forefathers built the Domakonda Fort around the Shivalayam 400 years ago.
OM NAMAH SHIVAYA #MAHASHIVRATRI #ramcharan pic.twitter.com/HhrvEzKyAt
— Upasana Konidela (@upasanakonidela) March 4, 2019
ఇక దోమకొండ కోటను 400 ఏళ్ల క్రితం తమ పూర్వీకులు కట్టించారని ఆమె తెలిపారు. అయితే.. సెలబ్రిటీ జంటలకు, ఫ్యాన్స్ కి ఆదర్శంగా నిలిచే రామ్ చరణ్ – ఉపాసన దంపతులు.. ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉంటారో చెప్పక్కర్లేదు. అయితే.. ఉపాసన దోమకొండకు చెందినవారే. తెలంగాణాలోని ప్రాచీన కోటలలో ప్రముఖమైంది ఈ దోమకొండ కోట. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ సంస్థానానికి బిక్కనవోలు సంస్థానమని కూడా పేరుంది. చుట్టూ పక్కలవారు దీన్ని గడి అని కూడా పిలుస్తుంటారు. మరి వైరల్ అవుతున్న రామ్ చరణ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Simplicity is the trademark of super stardom.. doing Shivalaya Seva is such a change from seeing temple run photo ops.. #RamCharan is a role model for celebs too 🙌🙌🙌#HarHarMahadevॐpic.twitter.com/8hvIeqGAhj
— ரேவா | रेवा 🇮🇳 (@zjinxe_reva) May 13, 2022
The #Domakonda Fort Shivalayam is over 800 years old from the Kakatiya Period.
Our forefathers built the Domakonda Fort around the Shivalayam 400 years ago.
OM NAMAH SHIVAYA #MAHASHIVRATRI #ramcharan pic.twitter.com/HhrvEzKyAt
— Upasana Konidela (@upasanakonidela) March 4, 2019