తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాజమౌళి తీసిన చిత్రాలు ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. టాలీవుడ్ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ చిత్రాన్ని డబ్ చేసి జపాన్ లో శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ జపాన్ కి వెళ్లి తెగ సందడి చేశారు.
జపాన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంతో గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి చిత్రం ఇక్కడ తప్పకుండా డబ్ చేసి రీలీజ్ చేస్తారు. తెలుగు స్టార్స్ అయిన యన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ బిజీలో ఉన్నారు రాజమౌళి, యన్టీఆర్, రామ్ చరణ్. ఒక కార్యక్రమంలో యన్టీఆర్ జపాన్ భాష మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. జపాన్ వీధుల్లో యన్టీఆర్, రామ్ చరణ్, కార్తికేయ సతీసమేతంగా ఎర్ర గులాభీలు పట్టుకొని.. ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకొని నడుచుకుంటూ వెళ్లారు.
జపాన్ వీధుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ హీరోలను చూసి అక్కడ ఉన్న ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోయారు… వారి సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకొని మురిసిపోయారు. ఈ సందర్భంగా తమ అభిమానులతో కాసేపు ముచ్చటించి.. ఆటో గ్రాఫ్ ఇచ్చి సంతోష పరిచారు యన్టీఆర్, రామ్ చరణ్. దీనికి సంబంధించిన వీడియో ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ పాటను జతచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోని రామ్ చరణ్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.