Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు తెలుగు తెరపై అరుదుగా కనిపిస్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్. 2011లో వచ్చిన కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్.. స్టార్ హీరోయిన్‌గా మారటానికి చాలా ఏళ్లే పట్టింది. ‘‘నాన్నకు ప్రేమతో’’ సినిమాతో తెలుగులో మొదటిసారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుస హిట్లను అందుకున్నారు. అయితే, ‘‘ధృవ’’ సినిమా తర్వాతి నుంచి వరుస ప్లాపుల్లోకి వెళ్లిపోయారు. తెలుగులో సినిమా అవకాశాలు తగ్గిపోవటంతో మెల్లగా తెలుగు తెరకు దూరం అయ్యారు. హిందీ సినిమాల్లో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు జక్కీ భగ్నానితో ప్రేమలో పడ్డారు. జనవరి నెలలో రకుల్ తన ప్రేమపై స్పందించారు. జక్కీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వీరిద్దరూ నేరుగానే కాదు.. సోషల్ మీడియా ద్వారా కూడా ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటారు. తాజాగా, వీరిద్దరి మధ్యా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా జరిగిన చిన్న చిట్‌చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చాకోబార్ ఐస్‌క్రీమ్ తింటున్న ఫొటోను షేర్ చేశారు. చాకోబార్‌ను తినటాన్ని ఉద్ధేశిస్తూ.. ‘‘ ఇది మోసం కాదు.. ట్రీట్.. ఎప్పుడో ఒక సారి చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవటానికి.. మీ మనసుకు మోసపోయాననే భావన కలుగకుండా శిక్షణ ఇవ్వండి. సంతోషాన్ని ఇచ్చే హార్మోన్స్ విడుదల అవ్వనివ్వండి’’ అని పేర్కొన్నారు.
రకుల్ పోస్ట్‌పై ఆమె ప్రియుడు స్పందించాడు. ‘‘వ్వావ్! వాట్ ఏ లవ్ లీ పిక్చర్’’ అంటూ కామెంట్ చేశాడు. దానికి ఆమె రిప్లై ఇస్తూ ‘‘థాంక్స్ ఫొటోగ్రాఫర్’’ అని అన్నారు. కాగా, రకుల్ ఫిట్‌నెస్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమె డైలీ ఎక్సర్‌సైజులు, దానికి తగ్గ డైట్‌ను ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ప్రేమలో పడ్డ తర్వాత రూల్స్‌ను కొద్దికొద్దిగా బ్రేక్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ పోస్ట్ పెట్టినట్లు ఉన్నారు. మరి, ఈ పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : బాక్సాఫీస్ వద్ద తగ్గని KGF-2 జోరు! RRR రికార్డ్స్ బ్రేక్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.