రాఖీ సావంత్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుండి..మొన్న జరిగిన పెళ్లి వరకు ప్రతిదీ వివాదాల పుట్టే. కొన్ని నెలల క్రితం ప్రియుడు అదిల్ ఖాన్ దురానీని అత్యంత రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంది. అది అనేక మలుపులు తీసుకుంది. ఇప్పుడు మరోసారి ఈమె పేరు తెరపైకి వచ్చింది.
సినిమా పరిశ్రమలో కొంత మంది నటీనటులు వివాదాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్ ఆటమ్ బాంబ్ రాఖీ సావంత్ ఈ కోవకే వస్తుంది. ఆమె పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుండి..మొన్న జరిగిన పెళ్లి వరకు ప్రతిదీ వివాదాల పుట్టే. కొన్ని నెలల క్రితం ప్రియుడు అదిల్ ఖాన్ దురానీని అత్యంత రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం బయటకు చెప్పగా.. దురానీ ప్లేటు ఫిరాయించాడు. ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించాడు. కథ సుఖాంతం అనుకునేలోపు మొదటి భర్తపై చేసిన ఆరోపణలే దురానీపై కూడా చేసింది ఈ బిగ్ బాస్ బ్యూటీ. దురానీని తనను హింసిస్తున్నాడని, చీటింగ్ చేశాడని కేసులు పెట్టింది. త్వరలో అతడితో విడిపోనున్నట్లు తెలిపింది.
ఈ కాంట్రవర్సీ క్వీన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి ఆమె పేరు అనుకోకుండా వచ్చింది. రాఖీ సావంత్ సోదరుడు, దర్శక నిర్మాత రాకేష్ సావంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈ నెల 7న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సారి మాట తప్పడంతో అరెస్టు అయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. 2020లో ఓ వ్యాపార వేత్త రాకేశ్ మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతడు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందంటూ ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తిరిగి డబ్బు ఇచ్చేస్తానన్న హామీతో బెయిల్‌పై విడుదలయ్యాడు.
అయితే రెండేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ అప్పు తీర్చకపోవడంతో.. మరోసారి ఇదే కేసులో అరెస్టు అయ్యాడు. మే 7న రాకేష్‍ను అరెస్టు చేసిన ముంబయి పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. రాఖీ సోదరుడిని ఈ నెల 22 వరకు కస్టడీకి అప్పగించింది కోర్టు. రాఖీ సావంత్ 6 టీన్స్ చిత్రంతో తెలుగు తెరకు పరిచమైంది. ఆ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడిన సంగతి విదితమే. రాఖీ సావంత్ అంటే మీకు ఏ విషయాలు గుర్తుకు వస్తాయో కామెంట్ల రూపంలో తెలియజేయండి.