ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తాము ప్రేమలో పడ్డామని ఏ విధంగా సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారో.. పెళ్ళైన తర్వాత కొద్దికాలానికే విడిపోయామని, విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడం కూడా ఇప్పుడు సాధారణం అయిపోయింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్.. అతి కష్టం మీద భర్త రితేష్ సింగ్ పేరును తన శరీరంపై నుండి తొలగించుకుంది.
2019లో రాఖీ సావంత్.. రితేష్ సింగ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే.. వైవాహిక బంధంలో ముచ్చటగా మూడేళ్లు కాకుండానే ఇద్దరూ విడిపోయారు. రాఖీ కంటే ముందే రితేష్ కి వేరొకరి పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని తనకు చెప్పకుండా దాచాడని, మొదటి భార్యతో విడాకులు కాకుండా నన్ను పెళ్లాడాడు. చట్టబద్దంగా రితేష్ తో తన పెళ్లి చెల్లదని రాఖీ ఆవేదన వ్యక్తం చేసింది.
అదీగాక రితేష్ కూడా రాఖీతో పెళ్లి జరిగాక మొదటి భార్యతోనే ఉండాలని నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో గత వాలంటైన్స్ డే రోజున రితేష్ తో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది రాఖీ. అయితే.. పెళ్లయ్యాక రితేష్ పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. తాజాగా రితేష్ పేరున్న టాటూని తొలగొంచింది రాఖీ. “టాటూని తొలగించేటప్పుడు ఎంతో నొప్పిని భరించానని, రితేశ్ నువ్వు నా జీవితం నుంచే కాదు, నా శరీరం నుంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోయినట్టే” అంటూ సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమలో ఉన్నవాళ్లు టాటూస్ మాత్రం వేయించుకోవద్డు అంటూ యూత్ కి సజెస్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం రాఖీ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రాఖీ సావంత్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.