ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సెలబ్రిటీల కుటుంబాలను, ఇటు సినీ అభిమానులను ఎంతో బాధిస్తున్నాయి. ఇటీవల పలువురు టాలీవుడ్ లెజెండ్స్ తో పాటు రీసెంట్ గా లెజెండరీ నటి జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూయడంతో.. సినీ ప్రేక్షకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారి మరణవార్తల నుండి కోలుకోకముందే మరో ప్రముఖ నటి ఇంట విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి జయ సావంత్ కన్నుమూశారు. కొంతకాలంగా ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ తో బాధపడుతున్న జయ సావంత్.. పరిస్థితి విషమించడంతో శనివారం (జనవరి 28) ముంబై జుహు ఏరియాలోని సిటీ కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్నీ రాఖీ సావంత్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తన తల్లి జయ సావంత్ గురించి చెబుతూ.. ఎంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రాఖీ. తన తల్లిని మిస్ అవుతున్నానంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట అందరినీ కలచివేస్తోంది. వీడియోలో తల్లి బెడ్ పై ఉండగా.. బెడ్ పక్కనే కూర్చొని రాఖీ ఏడుస్తూ కనిపించింది. కొద్దిరోజులుగా రాఖీ తన తల్లి ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతోంది. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి కూడా చేసుకుంది. ఇలాంటి తరుణంలో ఆమె తన తల్లిని కోల్పోవడం అనేది బాధాకరమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాఖీకి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.
#RakhiSawant‘s mom RIP 💔🙏 @viralbhayani77 pic.twitter.com/ehRbOujdTZ
— Viral Bhayani (@viralbhayani77) January 28, 2023