బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది శృంగార తార రాకీ సావంత్. బాలీవుడ్ లో నటిగా, డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దు గుమ్మ భర్త రితేష్ సింగ్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది. ఆ తర్వాత ఆమె సహ నటుడు ఆదిల్ ఖాన్ దురానీ ని కోర్ట్ మ్యారేజ్ చేసుకుంది. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి ఆదిల్ ఖాన్.
వివాహం జరిగి ఏడాది కాకుండానే ఆమె తన భర్తపై పలు సంచలన ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఆదిల్ తనకు తెలియకుండా వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఇటీవల మీడియా ముందు ఫైర్ అయ్యింది. తాజాగా నటి రాఖీ సావంత్ తన భర్త ఆదిల్ ఖాన్ దురానీపై దొంగతనం కేసు పెట్టింది. తన డబ్బు, విలువైన నగలు అతడు దొంగలించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదిల్ ఖాన్ ని ముంబై పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ఆదిల్ పెండ్లి పేరుతో ఆదిల్ తన వద్ద ఉన్న బంగారం, డబ్బు అంతా లాగేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన ఇంటి తాళాలు కూడా తీసుకొని ఇవ్వకుండా చిత్రం హింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఏడాది నటి రాఖీ సావంత్ ఆదిల్ ఖాన్ దురానీ ని వివాహం చేసుకున్న తర్వాత అతడు వేరే యువతితో సంబంధం పెట్టుకొని తనని దారుణంగా మోసం చేశాడని.. అంతేకాదు ఈ విషయం గురించి అడిగితే దాడి కూడా చేశాడని.. తన నెంబర్ బ్లాక్ చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. రాఖీ సావంత్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన ఓషివారా పోలీసులు అతడిపై ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తాను ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చానని.. ఆదిల్ ఖాన్ బాలీవుడ్ లో పేరు సంపాదించుకోవడానికి తనను దారుణంగా ఉపయోగించుకున్నాడని వాపోయింది రాఖీ సావంత్. తనతో విడిపోయిన తర్వాత అతని ఫ్రెండ్ తనూ తో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది. తన తల్లి చావుకు కూడా అతడే కారణం అని.. ఆమెకు చికిత్స చేయించే సమయానికి డబ్బు ఖర్చు పెట్టకపోవడంతో ఆమె కన్నుమూసిందని ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం ఆమెను కలవడానికి వచ్చిన ఆదిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాఖీ సావంత్, ఆదిల్ ఖాన్ కోర్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ అరెస్ట్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.