బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నటి, సింగర్ రాకీ సావంత్. ఎప్పుడూ తన వింతైన చేష్టలు, కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా తన భర్త నుంచి విడిపోతున్నట్లుగా మీడియా వేదికగా తెలిపింది. ఏడాది గడవక ముందే తన ప్రియుడు ఆదిల్ ఖాన్ ని వివాహం చేసుకొని మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో రాఖీ సావంత్ తన అభిమానులతో ఎంతో సందడి చేస్తూ కనిపించేది.. కానీ తాజాగా ఓ అభిమానిపై చిరు ఆగ్రహం ప్రదర్శించింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తున్నది.
బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ లో నటించిన మెప్పించిన హాట్ బ్యూటీ రాఖీ సావంత్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ మద్య డైరెక్టర్ సాజిద్ ఖాన్ కి సపోర్ట్ చేస్తూ.. నటి షెర్లిన్ చోప్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద సంచలనం సృష్టించింది. ఈ అమ్మడు ముంబై రోడ్లపై ఎన్నోసార్లు హల్‌చల్ చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ముంబైలో రోడ్డుపై నిలబడి ఉన్న రాఖీ సావంత్ ని చూసి అభిమాని పరిగెత్తుకెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతన్ని దూరంగా ఉండాలని వారించి ‘ముట్టుకోవద్దని.. కాస్త దూరంగా ఉండండి.. అప్పుడంటే వేరు కానీ నాకు ఇప్పుడు నాకు పెండ్లయ్యింది’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే సెల్ప‘పెండ్లీ కాక ముందు అంటే వేరు.. కానీ నాకు ఇప్పుడు పెండ్లయ్యింది’ అభిమాని వెళ్లాక అసలు ఈ సెల్పీలంటేనే అసహ్యం వేస్తుందని అంటూ మాట్లాడింది.
మొత్తానికి ఆ అభిమాని రాఖీ సావంత్ తో సెల్ఫీ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ వీడియో పై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతకు ముందు కూడా పెళ్లయ్యింది కదా.. అప్పుడు ఇలా కామెంట్ చేయలేదు అని ఒక నెటిజన్ అంటే.. రాఖీ సావంత్ ఎప్పుడూ కొత్త పదాలను మాట్లాడుతుంది.. ఆమెది ఓ ఫన్నీ క్యారెక్టర్ అంటూ కామెంట్ చేశారు.