నటీనటులు పైకి వారి జీవితాలను ఎంత ఎంజాయ్ చేస్తుంటారో.. లోపల వాళ్లు కూడా మనకంటే దారుణంగా అనారోగ్యం పాలవడం, ఆస్పత్రుల్లో చేరడం జరుగుతూ ఉంటుంది. తాజాగా తాను ఆస్పత్రిలో చేరినట్లు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ పేర్కొంది. నాలుగు గంటల పాటు వైద్యులు సర్జరీ చేయడంతో తాను కోలుకున్నట్లు చెప్పుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
రాఖీ సావంత్.. ఈ పేరు బాలీవుడ్‌లో బాగా వైరల్ అవుతూ ఉంటుంది. మీటూ సమయంలో తనుశ్రీ దత్తాపై ఈమె చేసిన ఘోరమైన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచాయి. బిగ్ బాస్‌లోనూ పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా వివాదాల చుట్టూనే ఉండేది. పెళ్లి విడాకులు, మళ్లీ ఎంగేజ్మెంట్ అన్నీ అయిపోయాక ప్రస్తుతం.. తనకంటే ఆరేళ్ల చిన్నవాడైన అదిల్ దురానీతో డేటింగ్ చేస్తోంది.
అయితే ఆమెకు పెద్ద ఆపరేషన్ ఒకటి జరిగిందంటూ వచ్చిన వార్తలు బాగా వైరల్ గా మారాయి. అందరూ తలా ఒక మాట మాట్లాడుతున్నారని చివరికి విషయం ఏంటో తానే క్లారిటీ ఇచ్చింది. గర్భాశయంలో ఓ కణితి ఉండటంతో బాగా కడుపునొప్పి వచ్చిందిని తెలిపింది. వైద్యులను సంప్రదించగా సర్జరీ చేసినట్లు చెప్పుకొచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన రీల్ ఒకటి వైరల్ గా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే డాన్స్ తో ఇరగదీసిన ఆఫత్ జవానీ మేరీ.. అనే సాంగ్‌కు కాలు కదిపింది. ఆస్పత్రి రూమ్‌లోనే ఆఫత్ అంటూ రాఖీ సావంత్ వేసిన స్టెప్పులు వైరల్ గా మారాయి. రాఖీ సావంత్‌కి సర్జరీ జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.